కందనవోలు నంద్యాల

ప్రపంచస్థాయి అత్యవసర వైద్య సేవలు, ట్రాన్స్‌ప్లాంట్ కేర్‌లో విశేష సేవలందిస్తున్న హైదరాబాద్‌ హైటెక్ సిటీ యశోద హాస్పిటల్స్‌కు ఎక్మో ప్రతిష్ఠాత్మక గుర్తింపు లభించిందనీ ఆసుపత్రి వైద్యులు నిశాంత్ పేర్కొన్నారు.నంద్యాల పట్టణం సూరజ్ గ్రాండ్ లో ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో హైదరాబాద్ హైటెక్ సిటీ యశోద ఆసుపత్రిలో చేస్తున్న వైద్య సేవలు వివరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
అత్యున్నత ప్రమాణాలతో ఎక్మో ఎక్ట్రాకార్పోరెల్ లైఫ్ సపోర్ట్ ఆర్గనైజేషన్ నుంచి ప్లాటినం సర్టిఫికేషన్ సెంటర్ గా గుర్తింపు పొందిందన్నారు.
ఈ గుర్తింపుతో భారతదేశంలో ప్లాటినం స్థాయి గుర్తింపు పొందిన ప్రముఖ ఎక్మో కేంద్రాల్లో యశోద హాస్పిటల్స్‌ ఒకటిగా నిలిచింది అని పేర్కొన్నారు.
అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న రోగులకు ఆధునిక లైఫ్‌ సపోర్ట్‌ అందించడంలో ఆసుపత్రి వైద్య బృందం అనుసరిస్తున్న అంతర్జాతీయ ప్రమాణాలకు ఈ గుర్తింపు నిదర్శనమని అన్నారు.
అత్యాధునిక ఎక్మో సేవలు
యశోద హాస్పిటల్స్‌లో విఎ,వి.వి. ఈసిపియర్ వంటి వివిధ రకాల ఎక్మో చికిత్సలను అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు. గుండె, ఊపిరితిత్తులు తదితర అవయవాల పనితీరు తీవ్రంగా దెబ్బతిన్న రోగులకు ఎక్మో ద్వారా అవసరమైన లైఫ్‌ సపోర్ట్‌ అందిస్తున్నామన్నారూ.
ఇందుకోసం క్రిటికల్‌ కేర్‌ వైద్యులు, కార్డియోథొరాసిక్‌ సర్జన్లు, పెర్ఫ్యూషనిస్టులు, ట్రాన్స్‌ప్లాంట్‌ నిపుణులు, ప్రత్యేక శిక్షణ పొందిన ఐసీయూ నర్సులతో కూడిన బహుళ విభాగాల వైద్య బృందం సేవలందిస్తోంది అన్నారు.
ట్రాన్స్‌ప్లాంట్‌ కేర్‌తో సమన్వయం
అత్యాధునిక సేవలతో పాటు గుండె, ఊపిరితిత్తులు, కాలేయం, మూత్రపిండాలు, ఎముక మజ్జ తదితర అవయవ మార్పిడి సేవలను కూడా అందిస్తున్నట్లు తెలిపారు. ఎక్మొ సేవలను ట్రాన్స్‌ప్లాంట్‌ కార్యక్రమాలతో అనుసంధానం చేయడం ద్వారా అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్న రోగులకు మెరుగైన చికిత్స అందించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.
తీవ్ర అనారోగ్యంతో ఉన్న రోగులను వేగంగా, సురక్షితంగా ఆసుపత్రికి తరలించేందుకు ప్రత్యేక ఎయిర్‌ అంబులెన్స్‌ సేవలు కూడా అందుబాటులో ఉన్నాయని తెలిపారు.
రోగుల ప్రాణ రక్షణే లక్ష్యం
యశోద హాస్పిటల్స్‌ వైద్యులు కృషిచేస్తున్నారని అన్నారు. ప్లాటినం గుర్తింపు, తమ వైద్య బృందం పాటిస్తున్న అత్యున్నత క్లినికల్‌ ప్రమాణాలకు గుర్తింపు అని పేర్కొన్నారు. ఎక్మో వంటి అత్యంత సంక్లిష్టమైన లైఫ్‌ సపోర్ట్‌ చికిత్సలను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా అందిస్తూ, అత్యవసర పరిస్థితుల్లో రోగుల ప్రాణాలను కాపాడటమే తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు.
ప్రపంచస్థాయిఎక్మో క్రిటికల్‌ కేర్‌, ట్రాన్స్‌ప్లాంట్‌ సేవలను ఒకే వేదికపై అందిస్తూ యశోద హాస్పిటల్స్‌ వైద్య రంగంలో మరో కీలక మైలురాయిని అధిగమించిందని పేర్కొన్నారు.యశోదా ఆసుపత్రిలో ఎక్మో వైద్యసేవలు మూడేళ్లుగా అందుబాటులో ఉండి ఎందరో ప్రాణాలు కాపాడమన్నారు.ఆగిపోయిన గుండెకు సి.పి.అర్ చేసి రోగులకు ఎక్మో పరీక్షలు చేసి రోగులకు పునర్జన్మ ప్రసాదించామన్నారు.గత నెలలో 12 మంది ప్రాణాలు కాపాడమన్నారు.రోగులు హైదరాబాద్ కు రాలేని వారు ఒక్క ఫోన్ చేస్తే నంద్యాల లో నే శాంతిరామ్,క్రిటికల్ కేర్ ఆసుపత్రుల్లో వైద్యసేవలు అందిస్తున్నారు.అవయవాలు చెడిపోయిన వారికి యశోదా ఆసుపత్రి పునర్జన్మ ప్రసాదిస్తుందని అన్నారు.రోగులు పూర్తి వివరాలకు 9247906103 నెంబర్ ను సంప్రదించాలని కోరారు.ఈ సమావేశంలో బాబయ్య,సుమంత్ పాల్గొన్నారు.

You missed