కందనవోలు ఆలూరు

ఆలూరు పట్టణంలో ఎల్లార్తి రోడ్డులో సిసి రోడ్ నిర్మాణం చేపట్టడం జరిగింది కాని రోడ్డు ఇరువైపులా బంకులు మరియు చెట్లు తొలగించకుండా సిసి రోడ్డు నిర్మాణం చేపట్టడంపై స్థానికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకు నిర్మాణం చేపట్టని వైపునే వాహనాల రాకపోకలు కొనసాగుతున్నాయి. అయితే రోడ్డు నిర్మాణం పూర్తయిన రోడ్డు పక్కన ఉన్న చెట్లు తొలగించకపోవడంతో బస్సులు, లారీలు వంటి భారీ వాహనాలు వెళ్లేందుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. టెండర్ నిబంధనల ప్రకారం ముందుగా కాలువలు నిర్మించి, రోడ్డు అడ్డంగా ఉన్న చెట్లు మరియు అడ్డంకులను తొలగించిన తరువాతే పనులు చేపట్టాల్సి ఉండగా, అధికారులు అనాలోచితంగా పనులు ప్రారంభించారని స్థానికులు ఆరోపిస్తున్నారు. చెట్లు తొలగించకపోతే ఈ సిసి రోడ్డు ద్వారా వాహనాల రాకపోకలు సాధ్యంకాదని వారు అంటున్నారు. అధికారులు వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.

You missed