కందనవోలు ​పులివెందుల

పులివెందుల పట్టణంలోని పడగొట్టిన పాత బస్టాండ్ సమీపంలో ఈ నెల 8వ తేదీన కలకలం రేపిన హత్యాయత్నం కేసును పోలీసులు వేగవంతంగా చేదించి ముగ్గురు నిందితులను అరెస్టు చేయడం జరిగిందని పులివెందుల డిఎస్పి మురళి నాయక్ పేర్కొన్నారు.వివరాలకు వెళితే
పాత కక్షల నేపథ్యంలో జరిగిన ఈ దాడిలో ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి వారి వద్ద నుంచి దాడికి ఉపయోగించిన కర్రలను స్వాధీనం చేసుకున్నారు.ఈ సందర్భంగా
శనివారం పులివెందుల అర్బన్ పోలీస్ స్టేషన్లో పత్రికా విలేకరుల సమావేశంలో కేసు వివరాలను డిఎస్పి బి మురళి నాయక్ పత్రికా ముఖంగా తెలియజేస్తూ ఇస్లాంపురంకు చెందిన ఇత్తల జగదీష్, భాకరాపురానికి చెందిన అల్లపాటి తిరుపాలు మధ్య రెండేళ్ల క్రితం అరటికాయల వ్యాపార హమాలీ అసోసియేషన్ ఏర్పాటు విషయంలో గొడవలు జరిగాయని అప్పట్లో పోలీసులు,పెద్దల సమక్షంలో రాజీ కుదిరినప్పటికీ, తిరుపాలు మనసులో కక్ష పెంచుకున్నాడని,
​ఈ నెల 8వ తేదీ రాత్రి 9:15 గంటల సమయంలో పట్టణంలోని ఒక బార్ వద్దజగదీష్,తిరుపాలు మధ్య మళ్ళీ మాట మాట పెరిగి రాత్రి 11 గంటల సమయంలో జగదీష్ పాత బస్టాండ్ వద్దకు రాగానే తిరుపాలు తన అనుచరులతో కలిసి జగదీష్‌పై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారన్నారు.ఈ దాడిలో జగదీష్‌కు తీవ్ర గాయాలవ్వగా, పోలీసులు బాధితుడిని కడప రిమ్స్‌కు తరలించి,సెక్షన్ 307 (హత్యాయత్నం) కింద కేసు నమోదు చేశారన్నారు.
​జిల్లా ఎస్పీ సెల్కే నచ్చికేత్ ఐపిఎస్ ఆదేశాల మేరకు, డీఎస్పీ మురళి పర్యవేక్షణలో సీఐ శ్రీరామ్,ఎస్సైలు మధుసూదన్ రెడ్డి,తిమోతి బృందం దర్యాప్తు చేపట్టింది. శనివారం ఉదయం పోలీసులకు అందిన సమాచారం మేరకు పాత కరెంటు ఆఫీస్ సమీపంలో ముగ్గురు నిందితులు అదుపులోకి తీసుకోవడం జరిగిందన్నారు.అల్లపాటి తిరుపాలు (34) గతంలో ఇతనిపై 7 జూదం కేసులు,
​అరిగెల విక్రమ్ ఇతను రౌడీషీటర్ గతంలో మహమ్మద్ రఫీ హత్య కేసులో కూడా నిందితుడు.​కడిక శ్రీనివాసులు ఇతనిపై కూడా రౌడీషీట్ ఉండటమే కాకుండా పలు క్రిమినల్ కేసులు ఉన్నాయి.​ఈ కేసులో నిందితుడైన రౌడీషీటర్ చిన్నా పెనుగొండ తరుణ్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు.ఇతని కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
​శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.ఇప్పటికే సబ్ డివిజన్ పరిధిలోని 478 మంది రౌడీషీటర్లు, అనుమానితులపై నిఘా ఉంచినట్లు పోలీసులు ఈ సందర్భంగా వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

You missed