కందనవోలు నంద్యాల

కార్యకర్తల సంక్షేమం కోసం అధినేత నిరంతరం శ్రమిస్తారు.
జనసేన కార్యకర్తలకు ఓర్పు,సహనం అవసరం.

జనాలకోసం పుట్టిన పార్టీ జనసేన,సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లో కి తీసుకొని పోవాల్సిన బాధ్యత జనసైనికులకు ఉందని జన సేన పార్టీ సమన్వయ కర్త కొణిదల సునీల్ పేర్కొన్నారు.
నంద్యాల పట్టణం పద్మావతి నగర్ లో బి9 గ్రాండ్ హోటల్ లో జనసేన నాయకులు మారాసు గురుబాబు, దండు మురళీకృష్ణ అధ్వర్యలో నిర్వహించిన కాఫీ విత్ కార్య కర్త అనే కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చింతా సురేష్ బాబు, ఇరిగేల సూర్యనారాయణ రెడ్డి,భవనాసి వాసు,కొణిదల సునీల్ ముఖ్య అతిధులుగా హాజరయ్యారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
..జన సేన అధినేత పవన్ కళ్యాణ్ పట్టుదలను చూసి ప్రజలు పార్టీలో చేరుతున్నారు.
జనాలకు సేవ చేయాలనే పార్టీ జన సేన పార్టీ అన్నారు
నిరంతరం ఆయన ఆలోచనతో రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అని పేర్కొన్నారు.
ఎన్నికల్లో పార్టీలో ఎంతమందికి సీట్లు ఇచ్చారో వారందరూ గెలిచి చరిత్ర సృష్టించారు అని పేర్కొన్నారు.
.జన సేన కార్య కర్తలకు ఓర్పు,సహనం అవసరం అన్నారు.
.మన ప్రాంతాల్లో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి,కొద్ది రోజులు ఓర్పుతో పార్టీని అభివృద్ధి తీసుకొని పోవాలి.
,రాబోయే కాలంలో పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయి అన్నారు.
.సేవ రాజకీయాలు చేసే నాయకుడు పవన్ కళ్యాణ్ అని కొనియాడారు.
కౌలు రైతులను ఆదుకున్న నాయకుడు పవన్ కళ్యాణ్ అన్నారు.
నందికొట్కూరు నియోజక వర్గంలో పిట్టల దొర మా నాయకుడిని విమర్శిస్తున్నారు,ఇంటిపేరు కొణిదెల కావడంతో మా నియోజకవర్గంలోని
కొణిదెల గ్రామంలో ప్రజలను,రైతులను ఆదుకున్నారన్నారు.
నందికొట్కూరు లో వైసిపి నాయకులు పైసా ఖర్చు పెట్టకుండా ఉండే నాయకులు సైతం విమర్శలు చేయడం తగదన్నారు.
జనసేన పార్టీలో ఎందుకు చేరారు అని కొందరిని అడిగారు.
ప్రస్తుత రాజకీయాల్లో కంటే విభిన్న మార్గాలు కనిపించడంతో పార్టీలో చేరుతున్నారన్నారు.
జనసైనికులు పవన్ కళ్యాణ్ ను ముఖ్యమంత్రిగా చూపించే బాధ్యత మన పై ఉందన్నారు.
2014 నుంచి పార్టీ పెట్టీ ఎన్నో కష్టాలు పడ్డారన్నారు.
చంద్ర బాబును అరెస్ట్ చేసినప్పుడు పవన్ కళ్యాణ్ పవర్ చూపించారన్నారు.
వైసిపి నీ ఎన్నికల్లో అదక్ పాతాళానికి తొక్కరన్నారూ.
నంద్యాలలో పార్టీ బలోపేతం కావడం ముఖ్య ఉద్దేశం.
ప్రతి కార్య కర్త ఊహించని రీతిలో అడుగులు వేయాలన్నారు.
ఏడాదిలో ఎన్నో పరిణామాలు చోటుచేసుకుంతయన్నారు.సంస్థాగత ఎన్నికలు విజయమే ధ్యేయంగా
గడప గడప కు కార్యకర్తలు ముందుకు పోవాలన్నారు.
ప్రపంచం లో అందరూ జన సేన పార్టీ వైపు చూస్తున్నారన్నారు.
గ్రూపు ఇజం చేసుకోవద్దు అందరూ కలసికట్టుగా పార్టీని బలోపేతం వైపు దృష్టి పెట్టాలన్నారు.
సమస్యలను కలిసికట్టుగా సాధించేందుకు మంత్రి, ఎమ్మెల్యే ,ఎంపీ లతో కలవాలన్నారు.
జన సేన పార్టీలో అందరూ కలిసి కట్టుగా ఉంటే నేతలు మనము చెప్పే పనులు చేస్తారన్నారు.
…కులమతాలకు అతీతంగా కలిసి పార్టీని ముందుకుటేసుకొని పోవాలన్నారు
రాజకీయాల్లోకి వచ్చి పవన్ కళ్యాణ్ ప్రజల కోసం రియల్ లైఫ్ వదులుకున్నారన్నారు.
.నిజాయితీగా పని చేస్తే పదవులు వెతుక్కుంటూ వస్తాయి అన్నారు.
ఐక్యమత్యం గా పని చేస్తే పదవులు వస్తాయన్నారు.
చులకనగా మాట్లాడేవారు,మనల్ని గౌరవించే విధంగా చేసుకునే పరిస్థితి కల్పించుకోవాలన్నారు.జనసైనికులు,వీర మహిళలు అంటే పవన్ కల్యాణ్ కు అమితమైన అభిమానం అన్నారు.కార్యకర్తల సంక్షేమం కోసం నిరంతరం పనిచేసే నాయకుడన్నారు.పట్టణ,గ్రామీణ ప్రాంతాల్లో జన సేన కార్యకర్తలు బలంగా ఉన్నా అధిష్టానం దృష్టికి వెళ్లకపోవడంతో కొద్దిగా కష్టాలు ఉన్నాయని కొందరు కార్యకర్తలు చెప్పుకొచ్చారు.ఏడాదిలో మార్పులు జరుగుతాయని త్వరలో నియోజకవర్గాల్లో పార్టీని బలోపేతం చేయడానికి కమిటీలు వేస్తామని అన్నారూ.ఈ కార్యక్రమంలో జనసైనికులు,వీర మహిళలు పాల్గొన్నారు.

You missed