కందనవోలు ఆలూరు

ఆలూరు పట్టణంలో పేద ప్రజల ఆకలి తీర్చే లక్ష్యంతో అన్న క్యాంటీన్ ను నేడు బుధవారం ఘనంగా ప్రారంభించనున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆలోచనతో అమలులోకి వచ్చిన ఈ పథకం ద్వారా కేవలం ₹5కే నాణ్యమైన భోజనం అందించనున్నారు. ఏప్రిల్ 15న ఉదయం 11 గంటలకు జరిగే ఈ కార్యక్రమానికి నియోజకవర్గ ఇన్చార్జి వైకుంఠం జ్యోతి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు. పేదవాడి ఆకలి తీర్చడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం అని నాయకులు పేర్కొన్నారు.

You missed