కందనవోలు నంద్యాల

నంద్యాలలోని ప్రముఖ శాంతిరామ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లో వైద్యులు మరో అరుదైన ఘనత సాధించారు.
40 సం” పి. నరసింహులు అనే వ్యక్తిని అత్యంత క్లిష్టమైన ప్రాణాపాయ స్థితి నుండి వైద్యులు రక్షించారు.
కేసు వివరాలు:
పి. నరసింహులు తీవ్రమైన శ్వాసకోశ ఇబ్బంది, కాళ్ళ వాపుతో హాస్పిటల్ లో చేరారు. వైద్యులు పరీక్షించగా, ఆయన కాళ్ళలోని లోతైన సిరల్లో రక్తం గడ్డకట్టినట్లు గుర్తించారు. ఈ రక్తపు గడ్డలు ఊపిరితిత్తులకు సరఫరా అయ్యే రక్త నాళాల్లో అడ్డుపడటం వల్ల
ఆయన పరిస్థితి విషమించడంతో
అత్యంత క్లిష్టమైన చికిత్స
కార్డియాలజీ నిపుణులు డాక్టర్ ఇ. నిఖిల్ ప్రవీణ్ డాక్టర్ టి. నిషిత రెడ్డి వారి బృందం తక్షణమే ఈ క్రింది చికిత్సలు అందించారు:
థ్రోంబోలిసిస్ రక్తనాళాల్లో గడ్డకట్టిన రక్తాన్ని కరిగించడానికి అత్యాధునిక ‘ (ఎస్ టి కే )’ ఇంజెక్షన్ ద్వారా 48 గంటలలో తక్షణ చికిత్స అందించారు.
కాళ్లలో గడ్డకట్టిన రక్తం గుండెకు లేదా ఊపిరితిత్తులకు చేరకుండా ఉండటానికి శరీరంలోని ప్రధాన సిరలో అత్యంత ఖచ్చితత్వంతో ‘ ఐ వి సి ఫిల్టర్’ను విజయవంతంగా అమర్చారు.
ఊపిరితిత్తులు, కాళ్ళ రక్తనాళాల్లో ఉన్న రక్తం గడ్డలు కరిగిపోయాయి. చికిత్స విజయవంతం కావడంతో పాటు, రోగి ఆరోగ్యం పూర్తిగా మెరుగుపడటంతో, సరిగ్గా ఒక నెల తర్వాత అమర్చిన ఆ ఫిల్టర్ ను కూడా వైద్యులు సురక్షితంగా తొలగించారు.
వైద్యుల సందేశం:
ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ:
నరసింహులు విషయంలో థ్రోంబోలిసిస్ (ఐ వి సి) ఫిల్టర్ ప్రక్రియ ప్రాణాలను కాపాడటంలో కీలక పాత్ర పోషించింది. ఇప్పుడు ఆయన గుండె పనితీరు ( ఈఎఫ్ 55-60%) సాధారణ స్థితికి చేరుకుంది,” అని తెలిపారు.
అత్యాధునిక క్యాథ్ ల్యాబ్ నిపుణులైన వైద్యులు అందుబాటులో ఉండటం వల్లే ఇలాంటి క్లిష్టమైన కేసులు సాధ్యమవుతున్నాయని శాంతిరామ్ హాస్పిటల్ మేనేజ్మెంట్ పేర్కొంది. ప్రాణాపాయం నుండి బయటపడినందుకు నరసింహులు ఆయన కుటుంబ సభ్యులు వైద్య బృందానికి కృతజ్ఞతలు తెలిపారు.
