కందనవోలు సింహాద్రిపురం

మండల పరిధిలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో నూతన విద్యా సంవత్సరాన్ని పురస్కరించుకుని “బడి పండుగ” (బడిబాట) కార్యక్రమాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. విద్యాశాఖ అధికారుల ఆదేశాల మేరకు ఉపాధ్యాయులు, ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఎంపీడీవో, ఎంఈఓ-1, ఎంఈఓ-2, పాఠశాల ప్రధానోపాధ్యాయులు ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రభుత్వ పాఠశాలల ప్రాధాన్యతను ప్రజలకు వివరించారు.
ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు కలిసి సింహాద్రిపురం గ్రామంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో అందిస్తున్న నాణ్యమైన విద్య, ఉచిత పాఠ్యపుస్తకాలు, యూనిఫారాలు, మధ్యాహ్న భోజనం, డిజిటల్ విద్య, అర్హత కలిగిన ఉపాధ్యాయులతో బోధన వంటి సౌకర్యాలను ప్రజలకు తెలియజేశారు.
ర్యాలీలో పాల్గొన్న విద్యార్థులు, ఉపాధ్యాయులు ప్రభుత్వ పాఠశాలల గొప్పతనాన్ని చాటిచెప్పే నినాదాలతో గ్రామ ప్రజల్లో అవగాహన కల్పించారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి వారి భవిష్యత్తుకు బలమైన పునాది వేయాలని పిలుపునిచ్చారు.
ముఖ్య అతిథులు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలు నేడు కార్పొరేట్ పాఠశాలలకు ఏమాత్రం తీసిపోకుండా మెరుగైన వసతులు, నాణ్యమైన విద్య అందిస్తున్నాయని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఉన్నత స్థాయి విద్యను అందించడంలో ప్రభుత్వ పాఠశాలలు కీలక పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు.
పాఠశాల ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడం, అడ్మిషన్లు పెంచడం, ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందించడం తమ లక్ష్యమని తెలిపారు. ఉపాధ్యాయుల కృషి, తల్లిదండ్రుల సహకారంతో ప్రభుత్వ పాఠశాలలు మరింత అభివృద్ధి చెందుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
సింహాద్రిపురం గ్రామంలో నిర్వహించిన ఈ బండిపండుగ ఉత్సవం – అడ్మిషన్ ర్యాలీ గ్రామ ప్రజల్లో ప్రభుత్వ పాఠశాలల పట్ల విశ్వాసాన్ని పెంచి, ప్రభుత్వ విద్యను మరింత బలోపేతం చేసే దిశగా విజయవంతంగా సాగింది. కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ పాఠశాల ప్రధానోపాధ్యాయులు కృతజ్ఞతలు తెలిపారు.

You missed