కందనవోలు కర్నూలు

అణగారిన వర్గాల కోసం దేశ మాజీ ఉప ప్రధాని డా.బాబు జగ్జీవన్‌ రామ్‌ నిరంతరం కృషి చేశారని ఎంపీ బస్తిపాటి నాగరాజు అన్నారు…బాబు జగ్జీవన్‌రామ్‌ 119 వ జన్మదినం సందర్బంగా నగరంలోని ఆర్.ఎస్ రోడ్డు సర్కిల్ లో గల ఆయన విగ్రహనికి ఎంపీ పూల మాలలు వేసి నివాళి అర్పించారు…ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహానీయుడు బాబు జగ్జీవన్‌రామ్ అని కొనియాడారు…దేశ నిర్మాణంలో, వ్యవసాయం, కార్మిక రంగాల అభివృద్ధిలో జగ్జీవన్‌రామ్ చేసిన సేవలు చిరస్మరణీయమన్న ఎంపీ , బడుగు బలహీన వర్గాలకు విద్య, ఉపాధి, రాజకీయ హక్కులు కల్పించడంలో ఆయన పాత్ర ఎంతో గొప్పదని తెలిపారు…ఈ కార్యక్రమంలో కురువ కార్పొరేషన్ డైరెక్టర్ రామకృష్ణ పాల్గొన్నారు…

You missed