కందనవోలు కర్నూలు

 

రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ పుట్టినరోజు సందర్భంగా నగరంలోని గౌరీ గోపాల్ హాస్పిటల్ లో కర్నూల్ అసెంబ్లీ నియోజకవర్గ ప్రజల కోసం ఏర్పాటుచేసిన ఉచిత వైద్య శిబిరాన్ని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ గుప్తా ప్రారంభించారు. ఈ ఉచిత వైద్య శిబిరంలో దాదాపు 4 వేల రూపాయల విలువ గల వైద్య పరీక్షలను ఉచితంగా నిర్వహించారు. అనంతరం వైద్యులు ఉచిత వైద్య శిబిరానికి వచ్చిన వారికి వైద్య పరీక్షలను నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా మాట్లాడుతూ ప్రజలు ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకొని ఆరోగ్యంగా జీవించాలని తెలియజేశారు. తమ గౌరీ గోపాల్ హాస్పిటల్ లో ప్రతినెల 16వ తేదీ ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు. ప్రజలు మిగతా సమయంలో హాస్పిటల్లోకి వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకోవాలంటే వేలల్లో ఖర్చవుతుందని, అదే ఉచిత వైద్య శిబిరాల్లో ఉచితంగా వైద్య పరీక్షలు చేయించుకోవచ్చని తెలియజేశారు. ఈ వైద్య పరీక్షల ద్వారా ఏవైనా వ్యాధులు ఉంటే ముందుగానే గుర్తించి చికిత్స పొంది పూర్తిగా కోలుకునేందుకు అవకాశం ఉంటుందని తెలియజేశారు. అలా కాకుండా ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసి కుటుంబ పెద్ద ఎవరికైనా జరగకూడనిది జరిగితే ఆ కుటుంబం వీధిన పడుతుందని ఆయన తెలిపారు. కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గ ప్రజల కోసం ఉచిత వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.

You missed