కందనవోలు కర్నూలు
కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలంలో పంచాయతీ సెక్రటరీ లక్ష్మీనాథ్ రూ.40,000 లంచం తీసుకుంటూ కర్నూలు అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులకు పట్టుబడ్డారు.
ఫిర్యాదుదారుడి నుంచి రూ.40 వేల లంచం స్వీకరిస్తున్న సమయంలో ఏసీబీ అధికారులు పంచాయతీ సెక్రటరీ లక్ష్మీనాథ్‌ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం అధికారులు ఆయన వద్ద నుంచి నగదును స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపగా, పూర్తి వివరాలను ఏసీబీ అధికారులు అధికారికంగా వెల్లడించాల్సి ఉంది.
