కందనవోలు వైస్సార్ కడప

 

621 చెరువుల (98%) పునరుద్ధరణ ప్రణాళికలు*

*76,983 నీటి సంరక్షణ నిర్మాణాలను శ్రీకారం*

*212 (ట్యాంక్ బెడ్ల)చెరువు పూడికతీత పనులతో చెరువుల నీటి నిల్వ సామర్థ్యం రెట్టింపు*

*190 చెరువుల గట్లను బలోపేతం*

*188 తూములు, 135 అలుగుల మరమ్మతులతో పాత సాగునీటి వ్యవస్థకు కొత్త జీవం*

*266 గ్రామాల్లో రైతు సంఘాల పర్యవేక్షణలోనే పనులు జరుగుతుండటంతో పారదర్శకతకు పెద్దపీట*

వైఎస్ఆర్ కడప జిల్లాలో సాగునీటి రంగంలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక కార్యక్రమం ‘జలధార-జలహారతి’ ద్వారా జిల్లాలోని చెరువులు, కుంటలు పునరుజ్జీవం పోసుకుంటున్నాయి.రాయలసీమ గుండెకాయ కడప జిల్లాలో జలకళ ఉట్టిపడుతోంది. దశాబ్దాలుగా జిల్లాను వెన్నాడుతున్న కరువు రక్కసిని తరిమికొట్టేందుకు జిల్లా యంత్రాంగం సరికొత్త వ్యూహంతో ముందుకు సాగుతోంది. జిల్లా కలెక్టర్ డా.శ్రీధర్ చెరుకూరి దిశానిర్దేశంలో ‘జలధార-జలహారతి’ పథకం అద్భుతంగా రూపుదిద్దుకుంటోంది. సాగునీటి శాఖ అధికారుల సమన్వయంతో క్షేత్రస్థాయిలో పనులు ముమ్మరంగా సాగుతున్నాయి.

*అసాధ్యం సుసాధ్యం!*
ఒకప్పుడు నీటి కోసం ఎడతెగని నిరీక్షణ ఉన్న చోట, నేడు ప్రణాళికాబద్ధమైన పనులతో భూగర్భ జల నిధిని పెంచుతున్నారు. కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తుండటంతో, సాగునీటి శాఖ అధికారులు యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేస్తున్నారు.

*మైలురాయి:98 శాతం చెరువుల పునరుద్ధరణ ప్రణాళికలు పూర్తి*

జిల్లాలోని సాగునీటి వనరులకు ఊపిరి పోయడంలో జిల్లా యంత్రాంగం రికార్డు సృష్టించింది.
లక్ష్యం: 633 మైనర్ ఇరిగేషన్ ట్యాంకులు.
సాధన: ఇప్పటికే 621 చెరువుల (98%) పునరుద్ధరణ ప్రణాళికలు సిద్ధం చేసి, పనుల అమలుకు శ్రీకారం చుట్టారు. ఇది రాష్ట్రంలోనే అత్యుత్తమ పురోగతిలో ఒకటిగా నిలుస్తోంది.

*భూగర్భంలో ‘జల నిధి’: దాదాపు 77 వేల కొత్త నిర్మాణాలు*
కేవలం చెరువులనే కాకుండా, భూమి పొరల్లో నీటి నిల్వను పెంచడానికి భారీ ప్రణాళిక సిద్ధమైంది.
*భారీ లక్ష్యం:*
జిల్లా వ్యాప్తంగా 76,983 నీటి సంరక్షణ నిర్మాణాలను (WC Structures) చేపట్టాలని నిర్ణయించారు.
*గ్రామ విప్లవం:* 828 గ్రామాల్లో చెక్ డ్యామ్‌లు, ఇంకుడు గుంతలు మరియు కందకాల ద్వారా వర్షపు నీటిని ‘బ్యాంకు’లో దాచినట్లు భూమిలో భద్రపరుస్తున్నారు.

*ఉపాధికి ఆసరా – రైతుకు భరోసా*
ఈ జల ధార ప్రాజెక్టును మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంతో (MGNREGS) అనుసంధానం చేయడం వల్ల రెట్టింపు ప్రయోజనం కలుగుతోంది.
ఇప్పటికే 688 పనులు మంజూరై వేగంగా సాగుతున్నాయి.గ్రామీణ ప్రాంత కూలీలకు చేతినిండా పని దొరుకుతుండగా, రైతులకు శాశ్వత సాగునీటి భరోసా లభిస్తోంది.

*క్షేత్రస్థాయిలో అద్భుత ప్రగతి:*
నాడు పూడిక – నేడు నీటి నిల్వ: 398 ఫీడర్ ఛానల్స్, 212 (ట్యాంక్ బెడ్ల)చెరువు పూడికతీత పనులతో చెరువుల నీటి నిల్వ సామర్థ్యం రెట్టింపు అయ్యింది.

*కట్టల రక్షణ:* 190 చెరువుల గట్లను బలోపేతం చేసి, భవిష్యత్ వరదలను తట్టుకునేలా తీర్చిదిద్దుతున్నారు.

*ఆధునీకరణ:*188 తూములు, 135 అలుగుల మరమ్మతులతో పాత సాగునీటి వ్యవస్థకు కొత్త జీవం పోశారు.

*సాగునీటి సంఘాలే ‘జల’ సైనికులు*
“సాగునీటి సంఘాల బాధ్యత” నినాదంతో రైతులను ఈ యజ్ఞంలో భాగస్వామ్యం చేయడం జిల్లా కలెక్టర్ గొప్ప వ్యూహం. జిల్లాలోని 266 గ్రామాల్లో రైతు సంఘాల పర్యవేక్షణలోనే పనులు జరుగుతుండటంతో పారదర్శకతకు పెద్దపీట వేసినట్లయ్యింది.

జిల్లాను జలసిరి గడప’గా మారుస్తాం.”

జలధార-జలహారతి ద్వారా పడే ప్రతి వర్షపు చుక్కను భూమిలోకి పంపి, భవిష్యత్ తరాలకు జలనిధిని అందించడమే మా సంకల్పం. కడపను కరువు రహిత జిల్లాగా మార్చడమే లక్ష్యంగా మేము చేస్తున్న ఈ కృషికి ప్రజల సహకారం మరువలేనిది. ఇప్పటికే 76 పనులు ముమ్మరంగా సాగుతున్నాయి, అతి త్వరలోనే మిగిలిన పనులను కూడా పూర్తి చేసి జిల్లాను ‘జలసిరి గడప’గా మారుస్తాం.  డా.శ్రీధర్ చెరుకూరి, జిల్లా కలెక్టర్, వైఎస్ఆర్ కడప.

 

You missed