కందనవోలు కర్నూలు

రాష్ట్ర ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి టీజీ భ‌ర‌త్ గుప్తా నిరంత‌రం కార్య‌క‌ర్త‌ల సంక్షేమం గురించి ఆలోచిస్తార‌ని రాష్ట్ర హ‌జ్ క‌మిటీ స‌భ్యులు మ‌న్సూర్ అలీ ఖాన్, తెలుగుదేశం పార్టీ న‌గ‌ర అధ్య‌క్షుడు కొర‌కంచి ర‌వి, ఏపీఐడీసీ డైరెక్ట‌ర్ సందీప్‌లు అన్నారు. క‌ర్నూలు నియోజ‌క‌వ‌ర్గంలోని 13వ వార్డు 37వ బూత్ ఇన్‌చార్జి రేష్మా భాయి, 25వ వార్డు 77వ బూత్ ఇన్‌చార్జి నాగ‌య్య పుట్టిన రోజు వేడుకల‌ను మంత్రి కార్యాల‌యంలో ఘ‌నంగా నిర్వ‌హించారు. రాష్ట్ర మంత్రి టీజీ భ‌ర‌త్ గుప్తా నిరంత‌రం నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు రాజ‌కీయంగా ఎదిగేందుకు కృషి చేస్తార‌ని ఈ సంద‌ర్భంగా నాయ‌కులు చెప్పారు. ఇలాంటి వినూత్న కార్య‌క్ర‌మాల ద్వారా క్యాడ‌ర్ ఎంతో సంతోషం వ్య‌క్తం చేస్తోంద‌న్నారు. సొంత కుటుంబంలా భావించి ప్ర‌త్యేకంగా విందు ఏర్పాటుచేస్తున్నార‌న్నారు. ఈ సంద‌ర్భంగా మంత్రి టీజీ భ‌ర‌త్ వీరికి పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. టీజీ భ‌ర‌త్ స‌హ‌కారంతో తాము రాజ‌కీయంగా ఎదుగుతున్న‌ట్లు రేష్మా భాయి చెప్పారు. ఈ కార్య‌క్ర‌మంలో వార్డు ఇన్‌చార్జిలు రాజ‌శేఖ‌ర్ యాద‌వ్, సురేష్‌, క్ల‌స్ట‌ర్ ఇన్‌చార్జి శ్రీనివాస రెడ్డి, బూత్ ఇన్‌చార్జిలు, త‌దిత‌రులు పాల్గొన్నారు.

You missed