కందనవోలు నంద్యాల
జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా నంద్యాల జిల్లా జనసేన పార్టీ నాయకులు దండు మురళీకృష్ణ మీడియాతో మాట్లాడుతూ..జాతీయ స్థాయిలో అగ్రగామిగా ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ విభాగం స్వయంప్రతిపత్తి, స్వావలంబన దిశగా అడుగులు ఫలితాన్నిస్తున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రణాళికలు గుడ్ గవర్నెన్స్, ఉమెన్ ఫ్రెండ్లీలో జాతీయ స్థాయిలో మొదటి స్థానం
• రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్ లోనూ నంబర్ వన్ స్థానం
• సంస్కరణలతో వ్యవస్థల బలోపేతం
• పారదర్శక విధానాలతో పల్లెల్లో అభివృద్ధి వెలుగులు
• పల్లె ప్రగతే పంచాయతీరాజ్ దినోత్సవానికి అసలైన నిదర్శనం అంటున్న ప్రజలు
స్థానిక సంస్థలు స్థానిక ప్రభుత్వాలుగా మారాలి… స్వయం ప్రతిపత్తి, స్వావలంబనతో ముందుకు సాగాలి…
పల్లెలు జాతీయ సమగ్రత, సుస్థిరతకు మూల కేంద్రాలు కావాలి…
ఇవీ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ బాధ్యతలు స్వీకరించిన గౌరవ ఉపముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్ నిర్దేశించుకున్న లక్ష్యాలు. గత ప్రభుత్వ విధానాలతో పూర్తిగా నిర్వీర్యం అయిన పంచాయతీరాజ్ వ్యవస్థకు పునరుజ్జీవం పోస్తూ, ప్రతి అడుగులో పారదర్శకతతో కూడిన పాలన, సరికొత్త సంస్కరణలు అమలు చేసిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు 22 నెలల కాలంలో ఆ దిశగా ఎన్నో అడుగులు ముందుకు వేశారు.
గ్రామీణ పాలనలో జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపారు. ఈ జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన కూటమి ప్రభుత్వం గ్రామీణాభివృద్ధిలో ఒక చారిత్రాత్మక దశకు చేరువయ్యింది. ఉప ముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్ దూరదృష్టితో కూడిన నాయకత్వంలో పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ (పి ఆర్ అండ్ ఆర్ డి) ప్రతి అడుగులో అపూర్వ విజయాలు అందుకుంటోంది. రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్ ( ఆర్ జి ఎస్ ఏ) ర్యాంకింగ్స్ లో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం 24వ స్థానం నుంచి నంబర్ వన్ స్థానానికి చేరుకుంది. రెండేళ్లలో సాధించిన అద్భుతం ఇది.
• గ్రామ సభలు చారిత్రాత్మక ఘట్టం
• ఉద్యోగులకు పదోన్నతుల ఉత్సాహం
• మౌలిక వసతులు, గ్రామీణ అనుసంధానం
గిరి శిఖర గ్రామాలకు బాటలు వేసిన “అడవి తల్లి బాట”
• వ్యర్థాల నిర్వహణ, స్వచ్ఛ సంకల్పం
గ్రామీణ పారిశుధ్య నిర్వహణలో మ్యాజిక్ డ్రెయిన్స్, స్వచ్ఛ రథాల ద్వారా విప్లవాత్మక అడుగులు వేశారు.
• గ్రామీణోపాధికి జీవం పోస్తున్న చర్యలు
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం.
• డిజిటల్ పాలనతో పారదర్శకత
• జాతీయ స్థాయి అవార్డుల్లో సంచలనం
జాతీయ స్థాయి పంచాయతీ అవార్డులలో పవన్ కళ్యాణ్ నాయకత్వంలోని ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ విభాగం విశేష ప్రతిభ కనబరిచింది. మహిళా స్నేహపూర్వక పంచాయతీ విభాగంలో తిరుపతి జిల్లాకు చెందిన బొక్కసంపాళెం గ్రామ పంచాయతీ జాతీయ స్థాయిలో ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకుంది. సుపరిపాలన (గుడ్ గవర్నెన్స్) విభాగంలో విశాఖపట్నం జిల్లాలోని శృంగవరం గ్రామ పంచాయతీ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. పేదరిక నిర్మూలన మరియు మెరుగైన జీవనోపాధి విభాగంలో వైఎస్ఆర్ కడప జిల్లాకు చెందిన చెమ్ముళ్లపల్లి గ్రామ పంచాయతీకి జాతీయ స్థాయిలో ద్వితీయ స్థానం దక్కింది. స్వయం సమృద్ధి మౌలిక సదుపాయాల విభాగంలో ప్రకాశం జిల్లాలోని గుండమాల గ్రామ పంచాయతీ తృతీయ స్థానాన్ని పొందింది. మండలం లేదా బ్లాక్ స్థాయిలో అందించే ప్రతిష్టాత్మక నానాజీ దేశ్ముఖ్ సర్వోత్తమ్ పంచాయతీ సతత్ వికాస్ పురస్కారానికి గాను చిత్తూరు జిల్లాలోని కుప్పం మండలం జాతీయ స్థాయిలో మూడవ స్థానంలో నిలిచింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నిరంతర సహకారంతో, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం చివరి వ్యక్తికి అభివృద్ధి ఫలాలు చేరే వరకు పని చేస్తుంది. గ్రామాలకు నిర్మిస్తున్న రోడ్లతో స్వయం సమృద్ధ వ్యవస్థను తీర్చిదిద్దుతున్నామన్న శ్రీ పవన్ కళ్యాణ్ ఆలోచనలు ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ వ్యవస్థను ప్రగతి పథంలో అగ్రగామిగా నిలుపుతోంది అని అన్నారు.
