కందనవోలు కర్నూలు

 

కర్నూలు నగరంలోని మౌర్య ఇన్ లోని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ కార్యాలయంలో కర్నూల్ అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ నాయకులు అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. రాష్ట్ర హజ్ కమిటీ సభ్యులు మన్సూర్ అలీ ఖాన్, తెలుగుదేశం పార్టీ కర్నూలు నగర అధ్యక్షులు కొరకంచి రవి తో పాటు ఎం.ఎస్.ఎం.ఈ డైరెక్టర్ వాయుగండ్ల కౌశిక్, పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు .ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం కృషిచేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగాలను భావితరాలకు గుర్తు చేస్తూ అమరావతిలో 58 అడుగుల ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని తెలియజేశారు. ఈ విగ్రహ ఏర్పాటుకు సంబంధించి రాష్ట్ర మంత్రి టీజీ భరత్ 1 కోటి రూపాయల విరాళాన్ని అందజేశారని తెలియజేశారు. అమరజీవి పొట్టి శ్రీరాములు తెలుగు వారందరికీ ప్రత్యేక రాష్ట్రము కావాలని 58 రోజులపాటు ఆమరణ నిరాహార దీక్ష చేసి అమరులు అయ్యారని ,ఆయన త్యాగం ఫలితంగానే తెలుగు వారందరికీ ఆంధ్ర రాష్ట్రం అవతరించిందని గుర్తు చేశారు. ఆయన జయంతి వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం తరఫున అధికారికంగా నిర్వహించడం అభినందనీయమని వెల్లడించారు. ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం తెలుగు జాతిని ఏకం చేసేందుకు అమరజీవి పొట్టి శ్రీరాములు చేసిన కృషి అందరికీ స్ఫూర్తిదాయకమని తెలియజేశారు.

You missed