కందనవోలు విజయవాడ

 

విజయవాడలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును రాష్ట్ర వాల్మీకి కార్పొరేషన్ చైర్మన్ కప్పట్రాల్లా బొజ్జమ్మ, మాజీ ఎంపీపీ రామచంద్ర నాయుడు మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు వారిని ఆప్యాయంగా పలకరించి యోగక్షేమాలు తెలుసుకున్నారు అనంతరం ఆలూరు నియోజకవర్గ పరిస్థితులు, అభివృద్ధి అంశాలపై ఆరా తీశారు. ఆలూరు నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, పార్టీ కోసం అంకితభావంతో పనిచేస్తున్న కార్యకర్తల పరిస్థితిని బొజ్జమ్మ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి వివరించారు.
నియోజకవర్గంలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి అవసరమైన చర్యలు చేపట్టడంతో పాటు, పార్టీ కార్యకర్తలకు తగిన గుర్తింపు, ప్రోత్సాహం అందేలా చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబును కోరారు. ఆలూరు నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం సానుకూల నిర్ణయాలు తీసుకుని ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాలని ఆకాంక్షించారు.

You missed