కందనవోలు కర్నూలు స్పోర్ట్స్
పట్టణంలోని విట్టల్ నగర్ లో ఉన్న గుడ్ షెఫర్డ్ స్కూల్లో నిర్వహించిన షూటింగ్ బాల్ వేసవి శిక్షణ శిబిరం ఆదివారం ఘనంగా ముగిసింది. ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ కురువ కార్పొరేషన్ డైరెక్టర్ కురువ వెంకటరముడు హాజరై క్రీడాకారులకు ప్రశంసాపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా జి. శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ, ఇలాంటి పోటీలను నిరంతరం నిర్వహిస్తేనే క్రీడాకారులు మంచి ఫలితాలు సాధిస్తారు. క్రీడలతో పాటు చదువులో కూడా చురుగ్గా ఉండాలి. క్రీడాకారులకు స్పోర్ట్స్ పరంగా ఎటువంటి సహాయం కావాలన్నా నేను సిద్ధంగా ఉంటాను అని హామీ ఇచ్చారు. ఇలాంటి వేసవి శిక్షణ శిబిరాలలో యువక్రీడాకారులను ప్రోత్సాహించడానికి ఇలాంటి వేదికలు చాలావసరం అని చెప్పారు. ఈ సందర్భంగా వచ్చిన అతిథులను అసోసియేషన్ సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పోస్ట్ ప్రమోటర్ జి శ్రీధర్ రెడ్డి , జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి భూపతి రావు , ఆంధ్రప్రదేశ్ షూటింగ్ బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పరుశ రాముడు, షూటింగ్ బాల్ శిక్షకుడు అంతర్జాతీయ షూటింగ్ క్రీడాకారుడు ఉపేంద్ర , వ్యాయామ ఉపాధ్యాయులు చిన్న సుంకన్న , నాగన్న , కిరణ్ కుమార్ , మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు.
