కందనవోలు కర్నూలు

ఎండల తీవ్రత రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో జర్నలిస్టుల ఆరోగ్య పరిరక్షణను దృష్టిలో ఉంచుకుని రాయలసీమ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో, కిమ్స్ హాస్పిటల్స్ సహకారంతో టోపీల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు జర్నలిస్టులకు టోపీలను అందజేసి వేసవి కాలంలో తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు.

ఈ సందర్భంగా సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ, ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు వెలుగులోకి తీసుకువచ్చే జర్నలిస్టులు ఎండ, వానలను లెక్కచేయకుండా విధులు నిర్వహిస్తుంటారని, వారి సంక్షేమం కోసం ఇటువంటి కార్యక్రమాలు చేపట్టడం సంతోషకరమని తెలిపారు. తీవ్ర ఎండల ప్రభావం నుంచి రక్షణ పొందేందుకు టోపీలు ఉపయోగపడతాయని పేర్కొన్నారు.
కిమ్స్ హాస్పిటల్ ప్రతినిధులు సీఈవో డాక్టర్ ఆదిత్య మాట్లాడుతూ, రాయలసీమ జర్నలిస్టు వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు కే శ్రీనువాసులు ఏపీజేఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు హరినాథ్ రెడ్డి జిల్లా అధ్యక్షుడు రామకృష్ణ జర్నలిస్టుల ఆరోగ్యం కూడా ఎంతో ముఖ్యమని, భవిష్యత్తులో ఆరోగ్య అవగాహన కార్యక్రమాలు, ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించేందుకు సహకారం అందిస్తామని తెలిపారు. కార్యక్రమంలో అసోసియేషన్ నాయకులు, జర్నలిస్టులు అవినాష్ చెన్నయ్య శ్రీనాథ్ రెడ్డి ప్రసాద్ రెడ్డి నరసింహ రాజు కెమెరామెన్ ఆంజనేయులు పాల్గొన్నారు.

You missed