కందనవోలు కర్నూలు

 


కే. నాగలాపురంలోని శ్రీ సుంకులా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో రాష్ట్ర కురువ కార్పొరేషన్ డైరెక్టర్ కురువ వెంకట్రాముడు తన జన్మదినం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు, సిబ్బంది ఆయనకు ప్రత్యేక ఆశీర్వచనాలు అందించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం నాగలాపురం, పెంచికలపాడు, బూడిదిపాడు గ్రామాల టీడీపీ నాయకులు కలిసి వెంకట్రాముడు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఉపాధ్యక్షుడు ఏ. గోపాల్ రెడ్డి, టీడీపీ గూడూరు మండల కన్వీనర్ సురేష్, పెంచికలపాడు కర్ణం చిన్న గిడ్డయ్య, కర్ణం యుగంధర్, గోవిందు, నరేష్ గౌడ్, బీసీ తిరుపాల్, మందుల బి. సుంకన్న, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.