కందనవోలు   పులివెందుల

వాహన చోదకులు ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలను ఖచ్చితంగా పాటించాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని పులివెందుల ట్రాఫిక్ సీఐ జి. ప్రసాదరావు హెచ్చరించారు. కడప జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాధ్ ఐపీఎస్ ఆదేశాల మేరకు, పులివెందుల డీఎస్పీ బి. మురళి సూచనలతో మంగళవారం పట్టణంలో ఆటో డ్రైవర్లు, యజమానులకు రోడ్డు భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సమావేశంలో సీఐ ప్రసాదరావు మాట్లాడుతూ, ప్రమాదాల నివారణకు డ్రైవర్లు క్రింది నియమాలను తప్పక పాటించాలని సూచించారు.ప్రతి వాహనానికి ఆర్‌సి, డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్, ఫిట్‌నెస్, పొల్యూషన్ సర్టిఫికేట్లు తప్పనిసరిగా ఉండాలి. ఆటోలలో ముందు సీట్లో ప్రయాణికులను, పాఠశాల విద్యార్థులను కూర్చోబెట్టకూడదు. పరిమితికి మించి అధిక లోడ్ ఎక్కించరాదు.మద్యం సేవించి వాహనాలు నడపడం, అతివేగం, మరియు డ్రైవింగ్ చేస్తూ సెల్ ఫోన్ మాట్లాడటం పూర్తిగా నిషిద్ధం.భద్రత: ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్, కార్ డ్రైవర్లు సీట్ బెల్ట్ ధరించాలి. వన్-వే నిబంధనలు పాటించాలి. రాంగ్ రూట్ డ్రైవింగ్ మరియు రాంగ్ పార్కింగ్ చేయకూడదు. మైనర్లకు వాహనాలు ఇవ్వరాదు.ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా ట్రాఫిక్ నియమాలను పాటించి సురక్షిత ప్రయాణానికి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్ఐ గంగాధర రెడ్డి మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

You missed