కందనవోలు హాలహర్వి

కర్నూలు జిల్లా హాలహర్వి మండలం విరుపాపురం గ్రామంలో మదాసి మదరి కురువ సంఘం ఆలూరు తాలూకా గౌరవ అధ్యక్షుడు గోనేహళ్ రంగన్న వారి నూతన గృహప్రవేశం కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్, సవితమ్మ దంపతులు ముఖ్య అతిథులుగా హాజరుకావడంతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది.
గోరంట్ల మాధవ్ దంపతులు విరుపాపురం గ్రామంలోకి అడుగుపెట్టగానే గ్రామ ప్రజలు మేళ తాళాలతో పూల జల్లులు కురిపిస్తూ ఘన స్వాగతం పలికారు. గ్రామ యువకులు, పెద్దలు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని వారిని ఆహ్వానించడం విశేషం. అనంతరం వారు గ్రామంలోని వాల్మీకి మహర్షి మరియు కనకదాసు విగ్రహాలకు పూలమాలలు వేసి గౌరవప్రదంగా నివాళులర్పించారు.
తదుపరి గోనేహళ్ రంగన్న వారి నూతన గృహప్రవేశం కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా ప్రారంభించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద మంత్రాల నడుమ జరిగిన ఈ కార్యక్రమం ఆధ్యాత్మికంగా ఎంతో భక్తి భావాన్ని కలిగించింది.
ఈ సందర్భంగా గ్రామ మహిళలు గోరంట్ల మాధవ్ దంపతులకు హారతులు ఇచ్చి నీరాజనాలు పలికారు. ప్రేమాభిమానాలతో జేజేలు కొడుతూ వారిని సత్కరించారు. చిన్నారులు, యువతీ యువకులు, పెద్దలు అందరూ కలసి ఈ వేడుకను మరింత ఉత్సాహంగా మార్చారు.
ఈ గృహప్రవేశ కార్యక్రమం ఆధ్యాత్మికత, సంప్రదాయం, సామూహిక ఆనందంతో నిండిన వేడుకగా నిలిచింది. గ్రామ ప్రజల ఐక్యత, ఆతిథ్య పరమైన భావం ఈ సందర్భంగా ప్రత్యేకంగా ప్రతిబింబించింది ఈ కార్యక్రమంలో నసనకోట ముత్యాలమ్మ ఆలయ కమిటీ మాజీ చైర్మన్ ముత్యాలు, మదాసి మదారి కురువ సంఘం తాలూకా కన్వీనర్ కౌడికేరాజు, ఉపాధ్యక్షుడు బసవరాజు, సహాయ కార్యదర్శి రమేష్, సంఘం సీనియర్ నాయకులు చిన్న హోతూరు మధు, ఉదయ్ కుమార్, గోబీ బసవరాజు, లింగమూర్తి, పురుషోత్తం, వెంకప్ప, పుల్లయ్య, ఆనంద్, మహిళలు యువకులు, చిన్నారులు భారీ ఎత్తున పాల్గొన్నారు. .
