కందనవోలు శ్రీశైలం

శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామివారికి ఉగాది మహోత్సవాల వేళ రికార్డ్ స్థాయిలో హుండీ ఆదాయం లభించింది. గత 30 రోజుల్లో భక్తులు సమర్పించిన కానుకల ద్వారా ₹ 7,19,58,064 నగదు వచ్చినట్లు ఈవో శ్రీనివాసరావు తెలిపారు. నగదుతో పాటు 122 గ్రాముల బంగారం, 6.5 కేజీల వెండి, వివిధ దేశాలకు చెందిన విదేశీ కరెన్సీని భక్తులు మొక్కుబడిగా చెల్లించుకున్నారు. శనివారం కట్టుదిట్టమైన నిఘా మధ్య ఈ హుండీ లెక్కింపు నిర్వహించారు.

You missed