కందనవోలు కర్నూలు
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, దివంగత నేత ఎన్.టి రామారావు ఆశయాలను కొనసాగిస్తూ సీ.ఎం చంద్రబాబు రాష్ట్రంలో పాలనలో సాగిస్తున్నారని కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు అన్నారు..ఎన్.టి.ఆర్ 30 వ వర్ధంతి సందర్బంగా ఆయన చిత్రపటానికి ఎంపీ తన కార్యాలయంలో పూలమాల వేసి నివాళి అర్పించారు…ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేసిన గొప్ప నాయకుడు ఎన్.టి రామారావు అని కొనియాడారు నిజాయితీగా, నిష్పక్షపాతంగా పాలన సాగించిన ఘనత ఎన్టీఆర్‌కు దక్కుతుందని తెలిపారు…ఈ కార్యక్రమంలో దిశ కమిటీ సభ్యుడు దేవ శంకర్, బి.ఎస్.ఎన్.ఎల్ టి.ఏ.సీ మెంబెర్ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు
