కందనవోలు న్యూస్ కర్నూలు
కర్నూల్ నగరంలోని తాలూకా పోలీస్ స్టేషన్ లో కందనవోలు న్యూస్ క్యాలెండర్ను తాలూకా సిఐ తేజ మూర్తి ఆధ్వర్యంలో ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా తాలూకా సిఐ మాట్లాడుతూ జర్నలిస్టులు సమాజంలో చెడును పారదోయాలని, అవినీతి లేని సమాజ స్థాపనకు పాటుపడాలని, ఉన్నది ఉన్నట్టుగా, వార్తలు రాయాలని, తాలుక సీఐ తేజ మూర్తి జర్నలిస్టులను కోరారు. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా పత్రిక విలేకరులు ఉంటున్నారు. ఏమైనా సమాచారం రావాలన్నా పత్రికల ద్వారానే తెలియజేస్తుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కర్నూలు తాలూకా సిఐ తేజ మూర్తి, ఎస్సై లు మోహన్ కిషోర్ రెడ్డి, మల్లికార్జున, రామాంజనేయులు, హనుమంత రెడ్డి, మరియు సిబ్బంది పాల్గొన్నారు.
