కందనవోలు కర్నూలు
కర్నూల్ జిల్లా ట్రాఫిక్ పోలీస్ విభాగం డ్రంక్ అండ్ డ్రైవ్‌పై కఠినంగా వ్యవహరిస్తోంది.
కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు, కర్నూల్ డీఎస్పీ బాబు ప్రసాద్ ఉత్తర్వులతో, కర్నూలు ట్రాఫిక్ సీఐ మన్సూరుద్దిన్ ఆధ్వర్యంలో ట్రాఫిక్ సిబ్బంది ప్రతిరోజూ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్నారు.
ఈ తనిఖీల్లో మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడిన వ్యక్తులపై కేసులు నమోదు చేసి, 20-01-2026 తేదీన కర్నూల్ JFCM కోర్టులో హాజరుపరిచారు.
ఈ కేసులను విచారించిన న్యాయస్థానం మొత్తం 61 మందికి ఒక్కొక్కరికి రూ.10,000 చొప్పున జరిమానా విధించింది. దీంతో మొత్తం రూ.6,10,000 జరిమానా వసూలైనట్లు కర్నూల్ ట్రాఫిక్ సీఐ ఎస్. మన్సూరుద్దిన్ తెలిపారు.
ప్రజల భద్రత దృష్ట్యా డ్రంక్ అండ్ డ్రైవ్‌కు పాల్పడేవారిపై ఇలాంటి కఠిన చర్యలు కొనసాగుతాయని ట్రాఫిక్ అధికారులు హెచ్చరించారు
