కందనవోలు కర్నూలు

కమ్మరి పార్వతమ్మ ఆంధ్రప్రదేశ్  విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్

 

యన్ డి ఏ కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలోసంక్రాంతి పండుగను రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ ఆనందోత్సహాల మధ్య జరుపుకుంటుంటే వైసీపీ నేతలు మాత్రం ప్రశాంత వాతావరణాన్ని చెడగొట్టి ప్రజలను భయభ్రాంతుల్ని చేసేందుకు హత్యా రాజకీయాలకు పాల్పడ్డారు. తుని నియోజకవర్గం కోటనందూరు మండలం అల్లీపూడి గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు, బీసీ నేత లాలం బంగారయ్యను వైసీపీ నేతలు అతి కిరాతకంగా హతమార్చారు,అధికారం కోల్పోయామని జీర్ణించుకోలేక అలజడులు సృష్టించే కుట్ర.. మా ప్రియతమ నాయకులు  నారా చంద్రబాబు నాయుడు  అలాగే నా యువ నాయకులు లోకేష్ బాబు  అమరావతిలో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తూ ప్రపంచంలో ఉన్న దిగ్గజ కంపెనీలన్నీ ఏపీ వైపు చూస్తుంటే పనికిమాలిన డైలాగ్స్ రప్పా రప్పా అంటూ పిలుపునిచ్చి, దాడులకు మరియు కుట్రలకు ప్రోత్సాహం ఇస్తున్న జగన్ మోహన్ రెడ్డి పార్టీ నాయకుల కుట్ర, బడుగు, బలహీన వర్గాలపై వైసీపీ నేతలు దమనకాండకు పాల్పడటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. వైసీపీ నేతలకు బీసీలంటే గిట్టదు, అంచలంచెలుగా ఎదిగి గుర్తింపు తెచ్చుకుంటున్న బీసీ నేతలను అణచివేయడమే లక్ష్యంగా వ్యవహరిస్తున్న వైసీపీ నేతలపై ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకుంటోంది తప్పు చేసిన వారిని ఎవరినీ వదలిపెట్టేదిలేదు,వైసీపీ హయాంలో జగన్ అండతో వైసీపీ నేతలు బీసీలపై దమనకాండకు పాల్పడ్డారు.. ఇప్పుడు కూడా అదే ధోరణితో వ్యవహరిస్తున్నారు,వైసీపీ హయాంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రాజ్యాంగం ఇచ్చిన 34 శాతం రిజర్వేషన్లలో కోత పెట్టడం వల్ల 16,800 బీసీ ప్రతినిధులు రాజ్యాంగబద్ధమైన పదవులకు దూరమయ్యారు. బీసీ సబ్ ప్లాన్ నిధులు రూ. లక్ష కోట్లు దారిమళ్లించారు, ఆదరణ రద్దు చేశారు,బీసీల రాజకీయ ప్రాతినిధ్యాన్ని దెబ్బతీసి ఇప్పుడు బీసీలపై వేధింపులకు పాల్పడుతున్నారు. మా నాయకుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు  నారా చంద్రబాబునాయుడు  మా యువ నాయకులు ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి ప్రదాత యువకుల ఆరాధ్య దైవం ఐటీ శాఖ మరియు విద్యాశాఖ మంత్రివర్యులు  నారా లోకేష్ బాబు  బీసీల పట్ల అమితమైన ప్రేమతో బీసీల పక్షపాతిగా 34 శాతం రిజర్వేషన్ అమలు చేయడం కోసం న్యాయ సలహా ఆమోదింపజేసిన గొప్ప వ్యక్తులు మా నాయకులు అలాంటి వారిని విమర్శించే స్థాయి కూడా లేనటువంటి వైసీపీ నాయకులు దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉంది,జగన్ రెడ్డి పాలనలో బీసీలకు జరిగింది అడుగడుగునా అవమానమే, జగన్ రెడ్డి సొంత జిల్లా ప్రొద్దుటూరులో చేనేత వర్గానికి చెందిన నందం సుబ్బయ్యను రోడ్డు మీదే అత్యంత కిరాతకంగా హత్య చేశారు. అమర్ నాథ్ గౌడ్ ను నడిరోడ్డుపై పెట్రోల్ పోసి నిప్పంటించి చంపారు.జగన్ మోహన్ రెడ్డి కుల రాజకీయాలను బీసీ రాజకీయంగా నాశనం చెయ్యాలి అని పూనుకున్నాడు”అని మీడియా మిత్రులతో రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్ కమ్మరి పార్వతమ్మ గ తెలియజేసినారు.

You missed