కందనవోలు న్యూస్ కర్నూలు

కర్నూలు, నగరంలో ఉప రవాణా కమీషనర్, ఆధ్వర్యములో 20న తేది లారీ ఓనర్స్ అసోసియేషన్ బిల్డింగ్ హాల్, బళ్ళారి రోడ్, కర్నూలు నందు లారి ఓనర్లకు, డ్రైవర్లకు మరియు ప్రజలకు రోడ్డు భద్రత గురించి, గుడ్ సమారిటన్ ప్రాముఖ్యత గురించి వివరిస్తూ ఏదైనా ఆక్సిడెంట్ జరిగినప్పుడు మొదటి గంట లోపు (గోల్డెన్ హవర్ లో) దగ్గరలో గల ఆసుపత్రికి తీసుకెళ్ళినచో కేంద్ర ప్రభుత్వము 25,000-00 నగదు ప్రోత్సహకాన్ని అందిస్తుందని తెలియచేసారు అలాగే లారీ డ్రైవర్లు సహనంతో ఓపిగ్గా డ్రైవింగ్ చేయాలని, ట్రాఫిక్ నియమ నిబంధనలు తప్పకుండా పాటించాలని, నేషనల్ హైవేస్ తీసుకోవలసిన జాగ్రత్తలు, మద్యము సేవించి, సెల్ ఫోన్ మాట్లాడుతూ వాహనము నడుపడము వలన కలిగే అనార్థాలగురించి, హెల్మెట్, సీట్ బెల్టు ధరించడము వలన కలిగే ఉపయోగాల గురించి అవగాహనా కల్పించడము జరిగినది మరియు తప్పకుండా రైట్ సైడ్ నుంచే ఓవర్టేక్ చెయ్యమని, లారీ లను తప్పకుండా లే బై లోనే ఆపాలని, హైవే పై ఎట్టి పరిస్థితుల్లో అపావదని, ప్రతి ఆరు నెలలు ఒకసారి కంటి పరీక్ష చేసుకోవాలని, లారీలకు డాష్ బోర్డు కెమెరా బిగించుకోవాలని తెలియచేసారు, సెంట్రల్ గవర్నమెంట్ ప్రవేశ పెట్టిన మొబైల్ యాప్స్ తర్వాత జెన్ మురివాహన్ మరియు డీజీ లాకర్ ద్వారా డ్రైవింగ్ లైసెన్స్ మరియు వాహన పత్రాలను చూపించాలని తెలియజేశారు. కర్నూలు జిల్లా లో మూడు డ్రైవింగ్ ట్రైనింగ్ సెంటర్స్ వస్తున్నాయని తెలియజేశారు. రోడ్డు భద్రత పైన ప్రతిజ్ఞ చేయించటము జరిగినది. ఇందులో మోటార్ ట్రాన్స్పోర్టు వెహికల్ అధికారులు కె. రవీంద్ర కుమార్, ఆర్.వి. మధుసూదన్, ఎస్. నాగరాజా నాయక్, ఎం.వి. సుధాకర్ రెడ్డి రవాణాశాఖ, కర్నూలు మరియు ఎస్. మన్సూరుద్దీన్, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ కర్నూలు, ఎన్జీవో సభ్యులు పాల్గొన్నారు
