కందనవోలు కర్నూలు

కందనవోలు జాతీయ దినపత్రిక ఆధ్వర్యంలో రూపొందించిన నూతన క్యాలెండర్‌ను అమీలీయో హాస్పిటల్ అధినేత డాక్టర్ లక్ష్మీప్రసాద్ ఘనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని క్యాలెండర్‌ను విడుదల చేశారు.

ఈ సందర్భంగా డాక్టర్ లక్ష్మీప్రసాద్ మాట్లాడుతూ, కందనవోలు గ్రామ చరిత్ర, సంప్రదాయాలు, సంస్కృతి, ఐక్యతను ప్రతిబింబించేలా క్యాలెండర్‌ను రూపొందించడం అభినందనీయమని పేర్కొన్నారు. గ్రామాభివృద్ధికి, ప్రజల్లో సామాజిక చైతన్యం పెంపొందించేందుకు ఇటువంటి ప్రచురణలు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు.
కార్యక్రమంలో కందనవోలు తెలుగు దినపత్రిక సంపాదకులు కే. శ్రీనివాసులు, సంక్షేమ సాక్షి దినపత్రిక సంపాదకులు కే. రాజశేఖర్ పాల్గొని మాట్లాడుతూ, గ్రామానికి సంబంధించిన విశేషాలు, సామాజిక కార్యక్రమాలను ప్రజలకు చేరవేయడంలో కందనవోలు జాతీయ దినపత్రిక ముఖ్య పాత్ర పోషిస్తోందని తెలిపారు. గ్రామ ఐక్యతను బలపరిచేలా క్యాలెండర్ రూపకల్పన చేయడం సంతోషకరమని అన్నారు.
ఈ కార్యక్రమంలో అమీలీయో హాస్పిటల్ సీఈవో రమేష్ బబు మేనేజర్ రమేష్, హాస్పిటల్ సిబ్బంది, స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. క్యాలెండర్ ఆవిష్కరణ అనంతరం డాక్టర్ లక్ష్మీప్రసాద్ శాలువాతో ఘనంగా సత్కరించి, జ్ఞాపికను అందజేశారు.

You missed