కందనవోలు కర్నూలు

కర్నూల్ నగరంలోని వీకర్ సెక్షన్ కాలనీలో కె జనార్దన్ ఆచారి కార్యాలయంలో రాయలసీమ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ మరియు సంక్షేమ సాక్షి దినపత్రిక నూతన సంవత్సర క్యాలెండర్‌ను ప్రముఖ సామాజిక కార్యకర్త కే. జనార్ధన్ ఆచారి ఘనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు, సామాజిక అంశాలను స్పష్టంగా తెలియజేయడంలో కందనవోలు మరియు సంక్షేమ సాక్షి దినపత్రిక లు కీలక పాత్ర పోషిస్తోందని ప్రశంసించారు. సమాజ అభివృద్ధి, ప్రజా సమస్యలపై నిరంతరం స్వరం వినిపిస్తున్న ఈ పత్రికలు మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. నూతన క్యాలెండర్ ప్రజలకు ఉపయోగకరంగా, సమాచారంతో కూడినదిగా రూపొందినందుకు సంపాదక వర్గాన్ని అభినందించారు.
ఈ కార్యక్రమంలో పత్రిక ప్రతినిధులు, స్థానిక ప్రముఖులు పాల్గొని క్యాలెండర్ ఆవిష్కరణను విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో జనార్ధన్ ఆచారి 37 మరియు 41వ వార్డుల క్లస్టర్ ఇన్చార్జి కందనవోలు జాతీయ దినపత్రిక ఎడిటర్ కే శ్రీనివాసులు, స్టాఫ్ రిపోర్టర్ సంధ్య ప్రసాద్, షేక్ వలి,
ఖాదర్ భాష యూనిట్ ఇన్చార్జి, బాలకృష్ణ, సుబ్బారాయుడు బూత్ ఇంచార్జిలు శివ, అనిల్ లు పాల్గొన్నారు.
