కందనవోలు  కర్నూలు

 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 2025 అక్టోబర్ 24 తేదీన కర్నూలు లో జరిగిన బస్సు అగ్ని ప్రమాదంపై విచారణ చేయడానికి ఆంధ్రా ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రత్యేక బృందం నియమించడం జరిగింది. ఈ బృందానికి అధ్యక్షులుగా అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా హైదరాబాద్, డైరెక్టర్ బి. జనార్ధన్ రెడ్డి, ఐఏఎస్ (రిటైర్డ్), అడిషనల్ ట్రాన్స్పోర్టు కమిషనర్ ఎస్.ఎ.వి. ప్రసాద్ రావు,(రిటైర్డ్) మరియు ఇతర ఐదు మంది సభ్యులచే బృందం కర్నూల్ కు విచ్చేసారు. మొదటిగా వీరు కర్నూలు రవాణా శాఖ, పోలీస్ శాఖ, అగ్ని మాపక శాఖ, న్యాహి, వైద్య ఆరోగ్య శాఖ అధికారులుతో కలిసి ఫైర్ ఆక్సిడెంట్ జరిగిన చోటికి వెళ్ళి రోడ్ మరియు అక్కడి పరిస్థితులు మరియు కాలిపోయిన బస్ ను తనిఖీ చేశారు. వేరొక స్లీపర్ బస్ ను తెప్పించి పరిశీలించారు. ఈ సందర్భంగా అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా హైదరాబాద్, డైరెక్టర్ బి జనార్ధన్ రెడ్డి, మాట్లాడుతూ కర్నూల్ లో జరిగిన బస్సు అగ్నిప్రమాదంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరియు రవాణా శాఖ వారు అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ కు ఇండిపెండెంట్గా జరిగిన కారణాలు ఏంటి ఏ విధంగా జరిగింది. ఏ విధమైనటువంటి ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటే భవిష్యత్తులో ఇలాంటి రోడ్డు ప్రమాదాలను, రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు, మరణాలను ఏ విధంగా తగ్గించవచ్చు, అనేటువంటి కోణం మీద పరిశీలించి నివేదికను ఇవ్వామన్నరు. ఈరోజు అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ నిపుణుల బృందం మొట్టమొదటిసారిగా బస్సు అగ్ని ప్రమాదం జరిగిన ప్రదేశానికి వచ్చి పరిశీలిస్తున్నాము. పరిశీలించిన తర్వాత నివేదికను సమర్పిస్తామని అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ డైరెక్టర్ బి జనార్దన్ రెడ్డి అన్నారు. అనంతరం డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఎస్ శాంతకుమారి మాట్లాడుతూ 2025 అక్టోబర్లో జరిగినటువంటి బస్సు అగ్నిప్రమాదం పైన విచారణ చేయడం కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఒక సాంకేతిక బృందాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కమిటీకి అధ్యక్షత వహించిన డైరెక్టర్ డి జనార్దన్ రెడ్డి కమిటీ బృందాన్ని పెద్దగా ఉండి ఆయనే నడిపిస్తున్నారు. ప్రస్తుతం అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ కి డైరెక్టర్ ఉన్నారు. ఈ విచారణ పూర్తయిన తర్వాత ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడం జరుగుతుందని డిటిసి అన్నారు. ఈ కార్యక్రమంలో డిఐజి ఇంచార్జ్ ఎస్పి విక్రాంత్ పాటిల్, డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఎస్. శాంత కుమారి, న్యాహి ప్రాజెక్ట్ డైరెక్టర్, తరుణ్ కుమార్, కర్నూలు జిల్లా ఫైర్ అధికారి అవినాష్ జయసింహ, ప్రభుత్వ సర్వజన వైద్యశాల పరిపాలన అధికారి, డాక్టర్ వెంకటేశ్వర్లు, ఫోరెన్సిక్ విభాగపు అధికారి డాక్టర్ సాయి సుధీర్, ప్రాంతీయ రవాణా కార్యాలయం అధికారి ఎల్. భరత్ చవాన్, పత్తికొండ డిఎస్పి మరియు ఎస్డిపిఓ బి.వెంకట రామయ్య, మోటార్ వెహికల్స్ ఇన్స్పెక్టర్లు కె. రవీంద్ర కుమార్, ఆర్. వి. మధుసూధన్, ఎస్. నాగరాజా నాయక్, యం. వి. సుధాకర్ రెడ్డి. అసిస్టెంట్ మోటార్ వెహికల్స్ ఇన్స్పెక్టర్లు వి. బాబు కిషోర్, గణేష్ బాబు. పోలీస్ శాఖ ఎస్బి సిఐ మధుసూదన్, కర్నూల్ రూరల్ సీఐ చంద్ర బాబు నాయుడు, తదితరులు పాల్గొన్నారు.

You missed