కందనవోలు నంద్యాల

నంద్యాలలోని స్థానిక ఎస్బిఐ మెయిన్ బ్రాంచ్ నందు సమ్మె నిర్వహించిన బ్యాంకు ఉద్యోగులు ఎస్బిఐ మెయిన్ బ్రాంచ్ నుంచి గాంధీ చౌక్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు…
ఇప్పటిది కాదు పదేళ్ల నుంచి ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్ వారికి ఈ విజ్ఞప్తి తెలియజేయడమైనది ఈ విషయము ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్ ననుస్తూనే ఉంది గడిచిన వేతన సెటిల్మెంట్ లో ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్ వారు సంతకం కూడా చేయడం జరిగింది..ఐదు రోజుల పని దినాలు ఇస్తామని ఒప్పుకుంది ఈరోజు ప్రభుత్వ రంగ సంస్థలు ఎల్ఐసి ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్. సేవీ ,అదే విధంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వీటన్నిటికీ కూడా ఐదు రోజుల పని దినాలే ఉన్నాయి… మరి వాటికి ఇచ్చినప్పుడు మాకు ఎందుకు ఇవ్వరు అని ప్రభుత్వంతో సంప్రదింపులు నడిపి వీలైనంత త్వరలో ఐదు రోజుల పని దినాలు అమలు చేస్తామని ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్ చెబుతూనే ఉంది.. ఇన్ని రోజులు అయినా కూడా ఎ టువంటి ఫలితం లేదు..2023లో దీని గురించి సంతకం చేయడం జరిగింది ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్ కానీ ఇప్పటివరకు స్పందించక పోవడం దుర్మాగం అని అందువల్లనే ఈ రోజు యునైటైడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్ తొమ్మిది బ్యాంకులు కలిసి ఒక యూనియన్ గా ఏర్పడి ఈరోజు సమ్మె చేయడం జరిగింది.. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరుచుకొని ఐదు రోజుల పని దినాలు అమలు చేయకపోతే ముందు ముందు రోజుల్లో ఈ విషయం గురించి సమ్మె తీవ్రత పెంచుతామని అని మా హక్కును మేము తెచ్చుకుంటామని ఐదు రోజుల పని దినాలు మాకు కచ్చితంగా ఇవ్వాల్సిందే అని బ్యాంక్ ఉద్యోగులు తెలియజేశారు.. ఇది రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా కూడా ఈ రోజు 10 లక్షలకు పైన బ్యాంకు ఉద్యోగులు సమ్మెకు దిగినారు… ప్రజలకు ఇబ్బంది కలగకూడదని మేము ఇంతవరకు ఓపిక పట్టాము మా యూనియన్ కూడా ప్రజలు ఇబ్బంది పడకూడదని సమ్మెకు దిగలేదు కానీ ప్రభుత్వం దిగిరాలేదు కాబట్టి ఈరోజు మేము సమ్మెకు దిగాము ప్రభుత్వం కూడా ప్రజలను ఇబ్బంది పెట్టకుండా మాకు ఐదు రోజుల పని దినాలు ఇవ్వాలని బ్యాంక్ ఉద్యోగులు కోరారు.. అన్ని వ్యవస్థలలో ఎక్కువ ఒత్తిడికి గురయ్యే వ్యవస్థ మా బ్యాంక్ వ్యవస్థ మాత్రమే అని కరోనా టైం లో కూడా మేము ప్రాణాలకు తెగించి మేము కరోనాను కూడా పక్కనపెట్టి వెనకాడకుండా ఉద్యోగాలు చేశాము.. ఐదు రోజుల పని దినాలు అమలు కాకపోతే ముందు ముందు సమ్మె ఇంకా బలోపేతం అవుతుందని బ్యాంకు ఉద్యోగులు తెలియజేశారు.. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా కామ్రేడ్ వెంకటేశ్వర్లు, రీజనల్ సెక్రటరీ యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్ రీజనల్ ఇంచార్జి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ స్టాప్ అమరావతి సర్కిల్ రీజనల్ సెక్రటరీ. కామ్రేడ్ కిరణ్ మూర్తి ఎస్సీ ఎస్టీ ఆర్గనైజర్ సెక్రెటరీ కామ్రేడ్ రాజేష్ ఎస్సీ ఎస్టీ ఏజీఎస్ నంద్యాల రీజనల్ గౌస్, బ్యాంకు ఉద్యోగులు సిఐటియు సిపిఐ నాయకుడు లక్ష్మణ్, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఏ నాగరాజు, సిపిఎం పట్టణ కార్యదర్శి లక్ష్మణ్,సిఐటియు పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు కే మహమ్మద్ గౌస్, పి వెంకట లింగం, సిఐటియు సీనియర్ నాయకులు తోటమద్దులు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి నరసింహ నాయక్, తదితర నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

You missed