కందనవోలు కర్నూలు
టిడిపి జాతీయ అధ్యక్షులు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కోడుమూరు నియోజకవర్గ టిడిపి సీనియర్ నాయకులు, కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ డి. విష్ణువర్ధన్ రెడ్డి, ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి ఆదేశాల మేరకు ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ కార్యక్రమం గూడూరు మండలం పెంచికలపాడు గ్రామంలో నిర్వహించబడింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కురువ కార్పొరేషన్ డైరెక్టర్ కురువ వెంకటరాముడు, గూడూరు మండల కన్వీనర్ సురేష్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా సచివాలయం సిబ్బందితో కలిసి ఎంపిటిసి మద్దిలేటి, టిడిపి సీనియర్ నాయకుడు కర్ణం చిన్న గిడ్డయ్య, నాగేష్, గోపాల్, నాగ సుందయ్య, టిడిపి గ్రామ కమిటీ అధ్యక్షుడు తిప్పన్న, జానకి రాముడు, రామాంజనేయులు, కర్ణం యుగంధర్ తదితర టిడిపి నాయకులు పాల్గొన్నారు.పింఛన్ పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించి, లబ్ధిదారులకు సకాలంలో సహాయం అందించడం పట్ల నాయకులు సంతృప్తి వ్యక్తం చేశారు.
