కందనవోలు  కర్నూలు

 

కర్నూలు శివారులోని జగన్నాధ గట్టు పైన ఉన్న ట్రిబుల్ ఐ టి, టిడిఎం ఇంజనీరింగ్ కళాశాలలో జాతీయ రోడ్డు భద్రత 37వ మసోత్సవాలు నిర్వహించారు. రవాణా శాఖ అధికారి ఎస్ శాంతకుమారి ఆదేశాల మేరకు ఆర్టీవో ఎల్ భరత్ పర్యవేక్షణలో రోడ్డు భద్రత 37వ మసోత్సవాలు 31వ రోజు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా కర్నూల్ ప్రాంతీయ రవాణా అధికారి ఎల్ భరత్ చవాన్, ట్రిబుల్ ఐటి, టిడిఎం ఇంజనీరింగ్ కళాశాలలో ఇంజనీరింగ్ విద్యార్థులకు మరియు సిబ్బందికి రోడ్డు భద్రత గురించి వివరిస్తూ కేంద్ర ప్రభుత్వము ప్రవేశపెట్టిన “గుడ్ సమారిటన్” – “రాహ్ –వీర్” పతకము ద్వారా ఎదైనా ఆక్సిడెంట్ జరిగినపుడు మొదటి గంటలోగా గాయపడిన వారిని ఆసుపత్రికి తీసుకువెళితే 25,000 నగదు ప్రోత్సహకాన్ని ప్రభుత్వము అందిస్తుందని మరియు వ్యక్తిగతముగా ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడటము జరుగుతుందని చేప్పారు. ఇయర్ ఫోన్ మరియు బ్లూ టూత్ వాడుతూ వాహనములు డ్రైవ్ చేయకూడదు. అని చొప్పారు, ట్రాఫిక్ నియమ నిబంధనలు తప్పకుండా పాటించాలని, హెల్మెట్, సీట్ బెల్టు ధరించడము వలన కలిగే ఉపయోగాల గురించి అవగాహనా కల్పించడము జరిగినదన్నారు. వాహనదారులందరూ తప్పనిసరిగా ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ వాహనాలు నడపాలన్నారు ద్విచక్ర వాహనదారుడు హెల్మెట్ ధరించి వాహనం నడపాలన్నారు. నాలుగు చక్రాల వాహనాదారులు తప్పనిసరిగా సీట్ బెల్ట్ ధరించి వాహనం నడపాలన్నారు. మద్యం సేవించి వాహనాలు నడపరాదన్నారు. రాష్ డ్రైవింగ్ చేయరాదన్నారు. సెల్ఫోన్ మాట్లాడుతూ వాహనం నడపడం అత్యంత ప్రమాదకరమన్నారు. పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించరాదన్నారు. ఓవర్ లోడ్ వెయ్యరాదన్నారు. మైనర్లకు వాహనాలు ఇవ్వకూడదని ఆర్టీవో తెలియజేశారు. వాహనాదారులందరూ తప్పనిసరిగా రోడ్డు నియమ నిబంధనలను పాటించి తమ గమ్యస్థానాలకు చేరుకోవాలని కోరారు. అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ వి బాబు కిషోర్ రోడ్డు భద్రత పైన వీడియో ప్రదర్శించడము జరిగినదన్నారు, కర్నూల్ ట్రాఫిక్ ఎస్ఐ రమేష్, విద్యార్థులకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడము జరిగిందన్నారు. అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ గణేష్ బాబు, ట్రిబుల్ ఐటి, టిడిఎం ఇంజనీరింగ్ కళాశాల సిబ్బందితో మరియు విద్యార్థులతో రోడ్డు భద్రత పైన ప్రతిజ్ఞ చేయించారు. సుమారుగా 250 మంది విద్యార్థులు పాల్గొన్నారు. కర్నూలు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి
బి. లీలా వెంకట శేషాద్రి, జడ్జి మాట్లాడుతూ ప్రభుత్వం ప్రమాదాలు జరగకుండా రవాణా శాఖ అధికారులతో మరణాల సంఖ్యను తగ్గించడానికి తలపెట్టిన జాతీయ రోడ్డు భద్రత 37వ మసోత్సవాలు జనవరి 1 నుండి 31 వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. వాహనాదారులందరూ తూచా తప్పకుండా రహదారి భద్రత నియమాలను పాటించి వాహనాలను నడిపి మీ గమ్యస్థానాలకు చేరుకొని మీ కుటుంబాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఆయన వాహనాదారులను కోరారు. ట్రిబుల్ ఐటి, టిడిఎం ఇంజనీరింగ్ కళాశాల నందు ఇంజనీరింగ్ విద్యార్థులకు మరియు సిబ్బందికి రోడ్డు భద్రత గురించి, ట్రాఫిక్ సిఐ మన్సరుద్దీన్ మాట్లాడుతూ అజాగ్రత్త వలన చాల రోడ్డు ప్రమాదాలు జరుగుతాయని అందులో శిక్ష కూడా పడే అవకాశము ఉంది అన్నారు, మద్యము తాగడమువలన కలిగే అనర్థాల గురించి వివరించారు, ట్రాఫిక్ నియమ నిబంధనలు తప్పకుండా పాటించాలని, హెల్మెట్, సీట్ బెల్టు ధరించడము వలన కలిగే ఉపయోగాల గురించి అవగాహనా కల్పించడము జరిగినదన్నారు, జనవరి 1 నుండి 31 వరకు జరిగిన రహదారి భద్రత కార్యక్రమాలలో పోలీస్ శాఖ అధికారులతో కలిసి బైక్ ర్యాలీ నిర్వహించారు. ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి డ్రైవర్లకు ఆరోగ్య పరీక్షలు మరియు కంటి అద్దాలను ఉచితంగా అందించారు. గుడ్ సమారిటన్” – “రాహ్ –వీర్” పతకము గురించి ప్రజలకు అవగాహన కల్పించారు జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీ జిల్లా అధికారులతో కలిసి వాగ్దానం ర్యాలీని నిర్వహించి ప్రజలకు రోడ్డు భద్రతపై పూర్తి అవగాహన కల్పించారు. ఇలా పలు కార్యక్రమాలు చేశారు. ప్రభుత్వం రోడ్డు ప్రమాదాల వల్ల ప్రాణాష్టం జరగకుండా 31 రోజులుగా ఈ కార్యక్రమాన్ని రవాణా శాఖ ద్వారా అన్ని ప్రభుత్వ శాఖలతో కలిసి నేషనల్ హైవే నేషనల్ అథారిటీ ఆర్ అండ్ బి డాక్టర్స్ లతో కలిసి ఈ కార్యక్రమం ప్రజలకు అందించడం జరిగిందన్నారు.
ఈ కార్యక్రమంలో మోటార్ వాహనాల ఇన్సెక్టర్లు ఆర్.వి మధుసూదన్, కె రవీంద్ర కుమార్, ఎస్. నాగరాజ నాయక్, ఎంవి సుధాకర్ రెడ్డి, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్, వి బాబు కిషోర్, ఎన్. గణేష్ బాబు మరియు డా. డి. మురళి, డీన్ , డా. అక్తర్ ఖాన్, హెచ్ ఓ డి, డా. రవీంద్ర కట్ట, డీన్ తదితరులు పాల్గొన్నారు.

You missed