కందనవోలు కర్నూలు
భరత చైతన్య యువజన పార్టీ (బిసివై) నూతనంగా ప్రకటించిన స్టేట్ ఎగ్జిక్యూటివ్ కమిటీలో కర్నూలు జిల్లాకు చెందిన యువజన నాయకుడు శ్రీ రాచ కొవ్లుట్ల యాదవ్ (ఆర్కే యాదవ్)కు కీలక బాధ్యతలు అప్పగించారు. పార్టీ పట్ల ఆయనకున్న విధేయత, ముఖ్యంగా యువతలో, యాదవ సామాజిక వర్గంలో ఆయనకున్న పట్టును గుర్తించిన పార్టీ అధినేత శ్రీ బోడె రామచంద్రయాదవ్, ఆయనను ఈ పదవికి ఎంపిక చేశారు.ఈ నియామకంపై ఆర్కే యాదవ్ హర్షం వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ, “బిసివై పార్టీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ కమిటీలో నాకు స్థానం కల్పించిన మా నాయకుడు, స్ఫూర్తిప్రదాత శ్రీ రామచంద్రయాదవ్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఆయన అడుగుజాడల్లో నడుస్తూ, పార్టీ బలోపేతమే లక్ష్యంగా పనిచేస్తాను. కర్నూలు జిల్లాలో పార్టీని మరింత పటిష్టం చేయడానికి, బడుగు బలహీన వర్గాల గొంతుకగా నిలవడానికి నా శక్తివంచన లేకుండా కృషి చేస్తాను. ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడతాను” అని స్పష్టం చేశారు.
