కందనవోలు కర్నూలు

 

 

అమీలియో హాస్పిటల్‌లో వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా క్యాన్సర్‌పై అవగాహన పెంచేందుకు కేక్ కట్ చేయడం జరిగింది.ఈ సందర్భంగా వైద్యులు క్యాన్సర్ రోగులు మరియు సాధారణ ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. ముఖ్యంగా క్యాన్సర్ నివారణకు సమతుల ఆహార అలవాట్లు, ఆరోగ్యకర జీవన శైలి, రోజువారీ అలవాట్లలో మార్పులు ఎంత ముఖ్యమో వివరించారు. పొగతాగడం, మద్యం సేవించడం వంటి అలవాట్లను మానుకోవాలని, క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలోడా. బి. రేవతి – మెడికల్ ఆంకాలజిస్ట్, డా. శ్రీనివాసులు – రేడియేషన్ ఆంకాలజిస్ట్,డా. లక్ష్మీ ప్రసాద్ చాపే (ఎండి) పాల్గొని మాట్లాడుతూ, క్యాన్సర్‌ను ప్రారంభ దశలో గుర్తిస్తే పూర్తిగా నయం చేయవచ్చని, ప్రజలు భయపడకుండా ముందుకు వచ్చి చికిత్స పొందాలని తెలిపారు.అమీలియో హాస్పిటల్ ఇలాంటి అవగాహన కార్యక్రమాల ద్వారా సమాజంలో క్యాన్సర్‌పై జ్ఞానం పెంపొందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతోందని వైద్యులు తెలిపారు.

You missed