కందనవోలు కల్లూరు

 

కల్లూరు అర్బన్ 28వ వార్డు లక్ష్మీపురం గ్రామంలో రూ.90 లక్షల నిధులతో సీసీ రోడ్లు, సీసీ డ్రైనేజీ కాలువల అభివృద్ధి పనులు, అలాగే 32వ వార్డు ముజఫర్ నగర్ వాటర్ ట్యాంక్ వద్ద రూ.70 లక్షల నిధులతో సీసీ డ్రైనేజీ కాలువల పనులకు భూమి పూజ కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి.
ఈ కార్యక్రమాల్లో ముఖ్య అతిథులుగా టీడీపీ నంద్యాల జిల్లా అధ్యక్షురాలు, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ చైర్‌పర్సన్ కమ్మరి పార్వతమ్మ పాల్గొని శంకుస్థాపనలు చేశారు.
ఈ సందర్భంగా వార్డు నాయకులు, సీనియర్ నాయకులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

You missed