సంక్షేమ సాక్షి కర్నూలు

కర్నూలులో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ సాధన కోసం వైఎస్సార్ పార్టీ నాయకులు భేటీ అయ్యారు ఈ కార్యక్రమానికి రాష్ట్ర కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి సమావేశానికి ప్రత్యేకంగా విచ్చేసి పార్టీలో నేతలతో మర్యాదపూర్వకంగా కలిశారు. ముఖ్యంగా కర్నూలు జిల్లా వైయస్సార్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సిట్ర సత్యనారాయణమ్మ, కర్నూలు జిల్లా అధ్యక్షుడు ఎస్.వి. మోహన్ రెడ్డి, మేయర్ బి.వై. రామయ్య, రాష్ట్ర కార్యదర్శి తెర్నేకల్లు సురేందర్ రెడ్డి,వైయస్సార్ పార్టీ రాష్ట్ర మాదారి మా దాసి కురువ సంఘం అధ్యక్షులు గడ్డం రామకృష్ణ తదితరులు హాజరయ్యారు. భేటీలో ప్రాజెక్ట్ పురోగతి, మున్ముందు తీసుకోవాల్సిన కార్యక్రమాలు, సమన్వయ పనితీరు తదితర అంశాలను చర్చించారు. ఈ సమావేశం ద్వారా ప్రాజెక్ట్ సక్రమంగా ముందుకు సాగడానికి అవగాహన, ఆకాంక్షలు పెంపొందించాలని పార్టీ వర్గాలు తెలిపాయి.

You missed