కందనవోలు ఆలూరు

ఆలూరు నియోజకవర్గానికి చెందిన ఆలూరు పట్టణానికి చెందిన గోబీ బసవరాజు కుమారుడు కురువ మధు సపక్ తక్రా క్రీడలో ప్రతిభ చూపి భారత జాతీయ జట్టుకు ఎంపికై, శ్రీలంకలో జరిగే అంతర్జాతీయ పోటీల్లో భారత దేశాన్ని ప్రాతినిధ్యం వహించనున్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి కూడా జాతీయ స్థాయి క్రీడాకారులు వెలువడగలరని మధు తన ప్రతిభతో నిరూపించారు.
ఈ సందర్భంగా ఆలూరు టీడీపీ ఇన్‌చార్జ్ వైకుంఠం జ్యోతి క్రీడలకు ప్రోత్సాహకంగా మధుకు రూ.10,000/- ఆర్థిక సహాయం అందజేశారు. కష్టపడి సాధన చేస్తే ఏ క్రీడలోనైనా ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని ఆమె పేర్కొన్నారు. జాతీయ స్థాయిలో ఆలూరు నియోజకవర్గానికి గర్వకారణంగా నిలుస్తున్న ఈ విజయం మరెందరికో క్రీడల వైపు అడుగులు వేయడానికి ప్రేరణగా నిలవాలని ఆమె ఆకాంక్షించారు.
ఈ విజయం ద్వారా యువత చదువుతో పాటు క్రీడల్లో కూడా ముందుకు రావాలని, ప్రభుత్వం మరియు ప్రజాప్రతినిధులు క్రీడాకారులకు అండగా నిలవాలని పలువురు అభిప్రాయపడ్డారు.
