కందనవోలు కర్నూలు 
కర్నూలు నగరంలోని దేవనగర్ కు చెందిన గొల్ల శివ లీలవతి భర్త పేరు నాగరాజు 32 సం ” అనే మహిళ తన సంతానమైన ఇద్దరు చిన్న ఆడపిల్లలను ఎత్తుకొని కుటుంబ కలహాలతో భర్తతో గొడవపడి విటల్ నగర్ రైల్వే ట్రాక్ పై ఆత్మహత్య ప్రయత్నం చేసుకోవడానికి వెళుతుండగా గమనించిన స్థానికులు స్థానిక నాలుగవ పట్టణ సిఐ విక్రమసింహ కి విషయం తెలుపగా తక్షణమే స్పందించిన సిఐ ఆమె లొకేషన్ గుర్తించి సిబ్బంది హెడ్ కానిస్టేబుల్ జీనస్, కానిస్టేబుళ్ళు సుబ్బరాయుడు మరియు కృష్ణమూర్తి లను రైల్వే ట్రాక్ వద్దకు పంపగా రైల్వే ట్రాక్ పై ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధంగా ఉన్న తల్లి శివ లీలవతి ను మరియు రుతిక (4) మరో మూడు నెలల చిన్నారి ఈ ముగ్గురిని అదుపులోకి తీసుకొని వారిని విచారించి దేవనగర్ వాసులుగా గుర్తించి కర్నూలు 3 టౌన్ పోలీస్ కి కౌన్సిలింగ్ నిమిత్తం అప్పగించారు. తక్షణమే స్పందించి తల్లి కూతుర్లను కాపాడిన నాలుగవ పట్టణ పోలీస్ సిబ్బందిని సిఐ విక్రమ సింహ అభినందించారు.
