కందనవోలు కర్నూలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా నేడు *ఆంధ్రప్రదేశ్ వైద్య మండలి (APMC) ఎన్నికలు* నిర్వహించబడుతున్నాయి. ఈ ఎన్నికల్లో మొత్తం *84 మంది అభ్యర్థులు* పోటీ పడుతుండగా, రాష్ట్రవ్యాప్తంగా *56,373 మంది నమోదు చేసిన వైద్యులు ఓటర్లుగా* తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.ఈ సందర్భంగా *డాక్టర్ శ్రీహరి కురువ* మాట్లాడుతూ,ఫిబ్రవరి 9న ఉదయం 8:00 గంటల నుంచి సాయంత్రం 5:00 గంటల వరకు* ప్రతి అర్హత గల వైద్యుడు తన ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు.సుమారు *20 సంవత్సరాలుగా నిలిచిపోయిన వైద్య మండలి ఎన్నికలను*,
*HRDA (Health Care Reforms Doctors Association)* న్యాయస్థానంలో దీర్ఘకాల పోరాటం చేసి సాధించిందని ఆయన గుర్తు చేశారు. ఈ ఎన్నికల్లో HRDA ప్యానెల్ నుంచి *13 మంది అభ్యర్థులు* బరిలో నిలిచారని తెలిపారు.గతంలో వైద్యుల హక్కుల కోసం, వైద్య విద్యార్థుల అభివృద్ధి కోసం HRDA చేసిన కృషి, సాధించిన ఫలితాలను పరిశీలించి ఓటు వేయాలని ఆయన కోరారు. ఈ ఎన్నికలు పదవుల కోసం కాకుండా, *వైద్య వృత్తి గౌరవం, స్వతంత్రత మరియు భవిష్యత్తు కోసం జరిగే ఎన్నికలు* అని అన్నారు.వైద్యులు తమ *మొబైల్ ఫోన్ ద్వారానే ఆన్లైన్ ఓటింగ్* చేయవచ్చని,OTPను ఇతరులకు తెలియజేయకుండా*, పారదర్శకంగా ఎన్నికల నిర్వహణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,వైద్యుల సంక్షేమం, మెడికల్ కౌన్సిల్ బలోపేతం, వైద్య రంగంలో సంస్కరణల కోసం *బ్యాలెట్ నెంబర్ 68పై ఓటు వేసి గెలిపించాలని* కోరారు.
