కందనవోలు కర్నూలు

నగరంలోని ఎస్టీబీసీ డిగ్రీ కళాశాల మైదానంలో జనవరి 23 నుంచి అమిత హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న అమిత క్రికెట్ ప్రీమియర్ లీగ్ కార్యక్రమానికి నేడు ముఖ్యఅతిథిగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు గౌరు వెంకటరెడ్డి హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శారీరక దృఢత్వానికి మానసిక ఉల్లాసానికి క్రీడలు ఎంతో అవసరమని అమిత హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో జరుగుతున్న అమిత క్రికెట్ ప్రీమియర్ లీగ్ కు వివిధ రాష్ట్రాల నుండి క్రికెట్ క్రీడాకారులు హాజరవ్వడం మంచి పరిణామం క్రీడాకారులను ప్రోత్సహిస్తున్న అమిత హాస్పిటల్ యండీ కృష్ణ మావి చాపే,నిర్వాహకులు అర్జున్,నిరంజన్,శివకృష్ణ,చాంద్,జమీర్,వెంకీ,రాష్ట్ర అధ్యక్షులు రాయలసీమ రవికుమార్ లను ఆయన అభినందించారు.
ఈ సందర్భంగా అమిత హాస్పిటల్ యండీ కృష్ణ మావి చాపే మాట్లాడుతూ అమిత హాస్పిటల్ ఆద్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ తో పాటు ఇదే వేదికలో రక్తదాన శిబిరము నిర్వహించామని ప్రజాసేవలో భాగమవ్వాలనే ఆలోచనతో అమిత హాస్పిటల్ ఆద్వర్యంలో అనేక ఉచిత మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్నామని క్రీడలను ప్రోత్సహించానే ఉద్దేశంతోనే అమిత క్రికెట్ ప్రీమియర్ లీగ్ నిర్వహిస్తున్నామన్నారు ఆర్వీపీఎస్ రాష్ట్ర అధ్యక్షులు రాయలసీమ రవికుమార్ మాట్లాడుతూ కృష్ణ మావి చాపే ఎంతో ఖర్చులు, వ్యయప్రాయసలకోర్చి అమిత క్రికెట్ ప్రీమియర్ లీగ్ ని నిర్వహించడం అభినందించదగ్గ విషయమన్నారు ఈ కార్యక్రమంలో క్రికెట్ క్రీడాకారులు పాల్గొన్నారు.
