కందనవోలు కర్నూలు

ఆంధ్రప్రదేశ్ వైద్య మండలి (ఏపీఎంసీ) ఎన్నికలు విజయవంతంగా ముగిశాయి. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ఈ ఎన్నికల్లో మొత్తం *84 మంది అభ్యర్థులు పోటీ చేయగా, 30,773 మంది నమోదిత వైద్యులు ఓటర్లుగా పాల్గొన్నారు.*
ఫిబ్రవరి 9వ తేదీ ఉదయం 8.00 గంటల నుంచి సాయంత్రం 8.00 గంటల వరకు *ఆన్‌లైన్ విధానంలో* వైద్యులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.సుమారు *ఇరవై సంవత్సరాల పాటు నిలిచిపోయిన ఈ ఎన్నికలను హెల్త్ కేర్ రిఫార్మ్స్ డాక్టర్స్ అసోసియేషన్ (HRDA)* న్యాయపోరాటం ద్వారా సాధించడం రాష్ట్ర వైద్య చరిత్రలో కీలక ఘట్టంగా నిలిచింది. ఈ ఎన్నికల్లో HRDA ప్యానెల్ నుంచి *13 మంది అభ్యర్థులు బరిలో నిలవగా, 9 మంది ఘన విజయం సాధించడం* వైద్యుల విశ్వాసానికి నిదర్శనంగా నిలిచింది.ఆంధ్రప్రదేశ్ వైద్య మండలి ఎన్నికల *రిటర్నింగ్ ఆఫీసర్ శ్రీ కె.వి.ఎన్. చక్రధర్ బాబు* ఫిబ్రవరి 10వ తేదీన అధికారికంగా ఎన్నికల ఫలితాలను ప్రకటించారు.
ఈ ఎన్నికల్లో *కర్నూలు జిల్లావాసి డా. శ్రీహరి కురువ* గారి విజయం ప్రత్యేకంగా ప్రశంసనీయమైంది. ప్రస్తుతం కర్నూలులో *డిప్యూటీ సివిల్ సర్జన్‌గా* సేవలందిస్తున్న డా. శ్రీహరి కురువ, వైద్యుల హక్కులు, వైద్య సంస్కరణలు, మెడికల్ కౌన్సిల్ బలోపేతం కోసం గత అనేక సంవత్సరాలుగా నిరంతరం కృషి చేస్తున్నారు.
తన విజయంపై స్పందిస్తూ డా. శ్రీహరి కురువ మాట్లాడుతూ,
“ఈ విజయం నాకు అపారమైన ఆనందాన్ని ఇచ్చింది. అదే సమయంలో నా మీద మరింత బాధ్యతను పెంచింది. వైద్య మండలిని మరింత బలోపేతం చేయడానికి, వైద్యుల గౌరవం మరియు స్వాభిమానాన్ని కాపాడేందుకు అంకితభావంతో పని చేస్తాను” అని తెలిపారు.ఈ విజయం *వైద్యుల ఐక్యతకు, న్యాయపోరాటానికి, సంస్కరణల పట్ల ఉన్న ఆశకు ప్రతీకగా* నిలిచిందని పలువురు వైద్యులు అభిప్రాయపడ్డారు.
