కందనవోలు న్యూస్ కర్నూలు
మంగళవారం మాదిగ జేఏసీ & జై భీమ్ కమిటీ జిల్లా కన్వీనర్ పెద్దలు సోమసుందరం నాయకత్వంలో కమిటీ సభ్యులు కలిసి ఫిబ్రవరి 14వ తేదీన పెద్దలు దామోదరం సంజీవయ్య జయంతి అలాగే ఏప్రిల్ నెల 05 వ తేదీన జరగబోయే బాబు జగ్జీవన్ రామ్ జయంతి అలాగే ఏప్రిల్ నెల 11 తేదీన జరగబోయే పెద్దలు జ్యోతిరావ్ బా పూలే జయంతి అలాగే పెద్దలు భారత రాజ్యాంగ నిర్మాత భారతదేశానికి దశ దిశ చూపించిన మహానుభావుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి పండుగలను ప్రభుత్వ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించాలని కర్నూలు జిల్లా కలెక్టర్ ఎ సిరి ఐఏఎస్ ని కలిసి వినతిపత్రం ఇవ్వడం జరిగిందన్నారు. వినతిపత్రం తీసుకున్న కలెక్టర్ మహనీయులు పెద్దల పుట్టినరోజు పండుగలను గవర్నమెంట్ తరఫున ఘనంగా నిర్వహిస్తామని మాట ఇవ్వడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మాదిగ జేఏసీ మరియు జై భీమ్ ర్యాలీ కమిటీ సభ్యులు ముప్పసాని, సుధాకర్, రెడ్డిపోగు కళావతి, గద్ద రాజశేఖర్, బండారు శైలజా, ప్రభాకర్, సిద్దు, రాజు, సూర్యకుమార్, శ్రీరామ్, నరేష్, తదితరులు పాల్గొన్నారు.
