కందనవోలు కర్నూలు

 

 

రాష్ట్ర కురుబ కార్పొరేషన్ డైరెక్టర్ కురువ వెంకట రాముడు ఆధ్వర్యంలో కురువ సంఘం నాయకులు ఘనంగా సన్మానించారు. ఆయన ఎన్నిక వైద్య రంగంలో విశిష్టమైన గుర్తింపుగా నిలిచిందని, ఇది కురువ సమాజానికి కూడా గర్వకారణమని నాయకులు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో కురువ సంఘం నాయకులు బత్తిన కిరణ్, జిల్లా టీడీపీ ఉపాధ్యక్షుడు తిరుమలేష్, ఎల్లప్ప, ఈరేష్ లక్ష్మీపురం మురళి, పర్ల మహేష్, కల్లూరు శివ తదితరులు పాల్గొన్నారు. వారు డాక్టర్ శ్రీహరి కురువ పుష్పగుచ్ఛాలతో సత్కరించి, శాలువాలతో ఘనంగా సన్మానించి తమ హృదయపూర్వక అభినందనలు తెలిపారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, డాక్టర్ శ్రీహరి కురువ వైద్య రంగంలో విశేష సేవలు అందిస్తూ ప్రజల విశ్వాసాన్ని పొందారని, ఇప్పుడు మెడికల్ కౌన్సిల్ సభ్యునిగా బాధ్యతలు స్వీకరించడం ద్వారా రాష్ట్ర స్థాయిలో వైద్య వ్యవస్థ అభివృద్ధికి మరింత కృషి చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. సమాజానికి ఆయన మార్గదర్శకత్వం ఎంతో అవసరమని, యువతకు ఆయన ఆదర్శంగా నిలుస్తారని అన్నారు.డాక్టర్ శ్రీహరి కురువ కూడా తనపై చూపిన ప్రేమాభిమానాలకు కృతజ్ఞతలు తెలుపుతూ, వైద్య రంగంలో నైతిక ప్రమాణాలు పాటిస్తూ ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు కట్టుబడి ఉంటానని పేర్కొన్నారు. ఈ సన్మాన కార్యక్రమం సౌహార్ద వాతావరణంలో ఘనంగా నిర్వహించబడింది.

You missed