కందనవోలు న్యూస్ బనగానపల్లె..

నంద్యాల జిల్లా బనగానపల్లె పట్టణంలో ఈ నెల 7వ తేదీన తెల్లవారుజామున పీర్ల చావడి ప్రక్కన శ్రీనివాస జ్యువెలర్స్ లో సెటర్ ను గ్యాస్ కట్టర్ తో కట్ చేసి సెట్టర్న్ లిఫ్ట్ చేసి నగలను దొంగతనం చేసి అక్కడ నుంచి వెహికల్ లో వెళ్లిపోవడం జరిగింది. దానికి సంబంధించి బనగానపల్లె పోలీస్ స్టేషన్లో 18 తులాల బంగారం, 8 కేజీల వెండి ఆభరణాలు పోయినట్టుగా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కేసు నమోదు చేసిన వెంటనే సీఐ ప్రవీణ్, ఎస్ఐ సురేష్, ఎస్పై దుగ్గిరెడ్డి, ఎస్సై కల్పన వారి బృందం గంటల్లోనే రియాక్ట్ అయి ఇన్వెస్టిగేషన్ చేసి పాణ్యం దగ్గర ఉన్నటువంటి మూత పడిన స్టీల్ ఫ్యాక్టరీ దగ్గర ఆరు మందిని అరెస్ట్ చేసి వారి దగ్గర నుంచి 18 తులాల బంగారం, 8 కేజీల వెండి స్వాధీనం చేసుకుని నిందితులను పోలీస్ స్టేషన్ కు తరలించారు. నిందితులు 1:మహమ్మద్ ఇమ్రాన్ వయసు 26 సన్నాఫ్ మొగోదు ముస్తఫా, మైల దేవులపల్లి, రాజేంద్రనగర్ మండల్, రంగారెడ్డి డిస్ట్రిక్ట్ తెలంగాణ2: షేక్ మహబూబ్ ఇబ్రహీం, వయసు 34, ఓల్డ్ మసీద్, మైల దేవులపల్లి, రంగారెడ్డి డిస్ట్రిక్ తెలంగాణ 3: మహమ్మద్ నజీర్ వయసు 23, శ్రీరామ్ కాలనీ, జాలి పల్లి, బాలాపూర్, రంగారెడ్డి డిస్ట్రిక్ట్ తెలంగాణ 4. సయ్యద్ సదుల్లా వయసు 18, మైల దేవుళ్లపల్లి, పల్లె చెరువు, రాజేంద్రనగర్ మండల్, రంగారెడ్డి డిస్ట్రిక్ట్, తెలంగాణ 5. మహమ్మద్ షేక్షావలి వయసు 35, ఉదమ్ గడ్డ ఏరియా, మైలర్ దేవుపల్లి, రంగారెడ్డి డిస్ట్రిక్ట్, తెలంగాణ 6. సోమ్ కంబుల్ బాలకృష్ణ ( బాలాజీ) వయస్సు 23, పవర్ సబ్స్టేషన్ దగ్గర, మైలర్ దేవ్ పల్లి, రాజేంద్రనగర్ మండల్, రంగారెడ్డి జిల్లా తెలంగాణ వీళ్లంతా అవుకు దగ్గర ఒక ఉరుసు జరగడంతో అక్కడికి వచ్చి తిరిగి వెళుతూ బంగారు షాపులో దొంగతనం చేయడం జరిగింది. వీళ్లు టెంపోలో 12యుసి7112 వెహికల్ లో పారిపోవడం జరిగింది. గంటల వ్యవధిలోనే కేసు చేదించిన సీఐ ప్రవీణ్ కుమార్, సిసిఎస్ సురేష్ కుమార్, ఎస్సై దుగ్గి రెడ్డి, ఎస్సై కల్పన మరియు వారి బృందాన్ని డిఎస్పి శ్రీనివాసులు ఈ సందర్భంగా వారిని అభినందించారు. కేసు నమోదు అయిన అతి తక్కువ సమయంలోనే నిందితులను అరెస్ట్ చేసి వారి ప్రతిభను కనబరిచినందుకు పోలీస్ శాఖ పై ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.

You missed