కందనవోలు కర్నూలు

 

కర్నూలులో ఉన్న స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా శాయి హాస్టల్ కు అడ్మిషన్ నోటిఫికేషన్ విడుదల చేయాలని కోరుతూ శనివారం కర్నూలు అవుట్డోర్ స్టేడియం ఎదుట పెద్ద ఎత్తున క్రీడా సంఘాల ప్రతినిధులు,క్రీడాకారులు హాజరై నిరసన తెలిపారు. ఈ సందర్భంగా క్రీడా సంఘాల జేఏసీ నాయకుడు నాగరత్నమయ్య,జిల్లా ఒలంపిక్స్ సంఘం కార్యనిర్వాహక కార్యదర్శి సునీల్ కుమార్,బాక్సింగ్ సంఘం అధ్యక్షుడు సురేష్ గౌడ్,జిల్లా ప్రైవేట్ స్కూల్ వ్యాయామ ఉపాధ్యాయుల సంఘం అధ్యక్షుడు చిన్న సుంకన్న ,
జిల్లా టైక్వాండో సంఘం కార్యదర్శి సతీష్ లు హాజరై మాట్లాడారు.శాయి స్పోర్ట్స్ హాస్టల్ ను తిరుపతికి తరలించేందుకు కుట్రలో భాగంగానే ఇప్పటివరకు అడ్మిషన్ నోటిఫికేషన్ ప్రకటించలేదని అన్నారు. ఇతర రాష్ట్రాలకు చెందిన కోచ్ లు సెంటర్ ఇంచార్జి గా ఉన్నారు అన్ని వారు తిరుపతికి తరలించేందుకు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు.ఇప్పటికైనా స్పోర్ట్స్ అత్తారింటి అధికారులు స్పందించి అడ్మిట్ నోటిఫికేషన్ ఇవ్వాలని లేకపోతే రానున్న రోజుల్లో ఉద్యమం తీవ్రం చేస్తానని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో రాజు,భరత్, చరణ్,విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

You missed