కందనవోలు ఆలూరు

విద్యాబుద్ధులు నేర్పి తమ పిల్లలను బావి భారత పౌరులుగా.. తీర్చిదిద్దుతారని ఆశతో పిల్లలను పాఠశాలలో చేర్చితే… వారి జీవితాలను బుగ్గిపాలు చేస్తున్నారు. అసాధారణ రీతులలో విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారు. ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలలైనప్పటికీ నిర్వాహకులు పట్టించుకోకపోవడంతో ఇలాంటి దారుణ సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ఓ అబ్బాయిపై తోటి విద్యార్థులు హోమో సెక్సువల్ రేప్ చేయడం సంచలనంగా మారింది. రాత్రంతా విద్యార్థి కేకలు వేసిన అక్కడి నిర్వాహకులు స్పందించకపోవడం మరింత దారుణం.కర్నూలు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఆలూరు మండలం అరికేరి గురుకుల పాఠశాలలో విద్యార్థిపై తోటి విద్యార్థులే అమానుషానికి ఒడిగట్టారు. అర్ధరాత్రి సమయంలో ముగ్గురు విద్యార్థులు కలిసి బాధితుడిపై అత్యాచారానికి పాల్పడటం స్థానికంగా కలకలం రేపుతోంది.విద్య నేర్చుకోవాల్సిన పాఠశాల.. ఆ విద్యార్థికి నరకాన్ని చూపించింది. రక్షణగా ఉండాల్సిన గురుకులం భయానక కేంద్రంగా మారింది. కర్నూలు జిల్లా ఆలూరు మండలం అరికేరి గురుకుల పాఠశాలలో ఈ ఘోరం జరిగింది.విద్యార్థిపై ముగ్గురు విద్యార్థులు మూకుమ్మడిగా దాడి చేశారు. అర్ధరాత్రి సమయంలో ఆ బాలుడిని వివస్త్రను చేసి అత్యాచారానికి పాల్పడ్డారు. నొప్పి భరించలేక బాధితుడు కేకలు వేసినా.. ఉపాధ్యాయులు గానీ, వార్డెన్ గానీ పట్టించుకోలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.ఉదయం బాధితుడు తన తండ్రికి ఫోన్ చేసి కన్నీరు మున్నీరు కావడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. పాఠశాల యాజమాన్యం తమకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని, కనీసం స్పందించలేదని బాధితుడి తండ్రి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ప్రస్తుతం బాధితుడు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ దారుణానికి ఒడిగట్టిన వారిపై, నిర్లక్ష్యంగా వ్యవహరించిన గురుకుల సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నారు.

You missed