కందనవోలు గంజహళ్ల

కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలం గంజహళ్లి గ్రామంలో మహాత్మ బడే సాహెబ్ ఉరుసు మహోత్సవంలో ఎంపీ బస్తిపాటి నాగరాజు, ఎం.ఎల్.ఏ బీ.వి జయ నాగేశ్వరరెడ్ది పాల్గొన్నారు.. ఉరుసు సందర్బంగా దర్గా కు చేరుకున్న వారికి దర్గా పిఠాధిపతులు ముస్లిం సంప్రదాయ పద్దతిలో స్వాగతం పలికారు.. అనంతరం ఎంపీ నాగరాజు, ఎం.ఎల్.ఏ నాగేశ్వర రెడ్ది దర్గాను దర్శించుకుని ప్రత్యేక ప్రార్థనలు చేశారు…అంతకు ముందు గ్రామానికి విచ్చేసిన ఎంపీ, ఎం.ఎల్.ఏ కి టీడీపీ శ్రేణులు, గ్రామస్థులు పెద్ద ఎత్తున్న స్వాగతం పలికారు…ఈ కార్యక్రమంలో దర్గా పిఠాధిపతులు మహబూబ్ బాషా, సయ్యద్ చిన్న ముద్దుగోల్, రాష్ట్ర కురువ కార్పొరేషన్ డైరెక్టర్ రామకృష్ణ, ఎమ్మిగనూరు మార్కెట్ యార్డు చైర్మన్ మల్లప్ప, గోనెగండ్ల టీడీపీ నాయకులు, కార్యకర్తలు,మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు..
