కందనవోలు కర్నూలు

కర్నూల్ నగరంలో కండేరు వీధిలో జరిగిన ఘర్షణలో మృతి చెందిన మాదిగ మనోహర్ కుటుంబాన్ని పరామర్శిస్తున్నట్లు ఆయన తెలిపారు. జిల్లాలో దళితులపై వరుసగా దాడులు చేసి చంపుతున్న కూటమి ప్రభుత్వానికి చీమకుట్టినట్టు కూడా లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితులపై చిన్నచూపు చూస్తున్నారని ఆయన ఆసంతృప్తి వ్యక్తం చేశారు. మాదిగలను వరుసగా చంపుకుంటూ పోతూ ఉన్న ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ఆయన ఆరోపించారు. మనోహర్ చావుకు కారణమైన నిందితులను కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. జిల్లాలో వరుసగా ఆలూరు బొందిమడుగల కర్నూలు ప్రాంతాలలో మర్డర్లు జరుగుతున్న కూటమి ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ఆయన ఆరోపించారు. దళితులపై దాడు దాడులను కూటమి ప్రభుత్వం తక్షణమే అరికట్టాలని ఆయన కోరారు. రాష్ట్రవ్యాప్తంగా ఇదేవిధంగా దళితులపై దాడులు పునరావృతరమైతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలకు పిలుపు ఇస్తామన్నారు. రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీల పై జరుగుతున్న దాడులను ఆపకుంటే రాబోయే రోజుల్లో బుద్ధి చెప్తామని ప్రభుత్వానికి హెచ్చరించారు. ఇప్పటికైనా ప్రభుత్వం మేలుకొని దళితులపై దాడులు చేసిన వారిపై వారిపై కఠినంగా చర్య తీసుకోవాలని కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు

You missed