కందనవోలు కర్నూలు
ఆయన చిన్నారుల మరణం పట్ల తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు.
ప్రభుత్వం తక్షణమే స్పందించి అనేకచోట్ల ఫుడ్ సేఫ్టీ అధికారులు విస్తృత తనిఖీలు నిర్వహించి ఇటువంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని హెచ్చరించారు.
రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం, ప్రతిపక్ష పార్టీ ఇళ్ల మీద దాడులు , తిరుపతి లడ్డూ మీద అసత్య ఆరోపణలు తప్ప ప్రజా క్షేమం, చిన్నారుల ఆరోగ్యం, వీటి మీద ప్రభుత్వం కి శ్రద్ద లేదని , ఎంతసేపు ప్రతిపక్షం మీద బురదచల్లడం తప్ప ప్రజల ప్రాణాలు మీద ఇసుమంతైనా బాధ్యత లేదనీ, ప్రభుత్వం తక్షణమే రాష్ట్రంలో ని అన్నీ పాల కేంద్రాల మీద మెరుపు దాడులు నిర్వహించి ప్రజలకు స్వచ్ఛమైన పాలను అందించాలనీ ఆయన ప్రభుత్వం ని డిమాండ్ చేసారు.
పాలలో ప్రమాదకరమైన యూరియా,కాస్టిక్ సోడా , మెలమైన్ వంటి హానికరమైన రసాయనాలతో చిన్నారుల కిడ్నీలు పాడైపోయి మరణించడంతో పాటు,అనేక మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు
ప్రభుత్వం బాధ్యతరహితమైన పాలన వలన చివరకు చిన్నారులకి కూడా రాష్ట్రంలో రక్షణ లేదనీ , ఆరోగ్య శ్రీని ప్రభుత్వం అమలుచేయకపోవడం వలన ప్రైవేటు, కార్పోరేట్ ఆస్పత్రిలో ప్రజలు లక్షల రూపాయలు చెల్లించలేక ఇబ్బందుల్లో ఉన్నారనీ
ప్రభుత్వం తక్షణమే ఈదిశగా చర్యలు తీసుకోని పరిహారం తో పాటుగా బాధిత కుటుంబాలు కి ఆసరగా నిలబడాలని కోరారు.
