కందనవోలు దేవనకొండ

 

మండల కేంద్రమైన దేవనకొండలో ఆదివారం దిగంబర దివానే ముగితాత ఉరుసు సందర్భంగా కీర్తిశేషులు కేఈ మాదన్న జ్ఞాపకార్థంగా పత్తికొండ ఎమ్మెల్యే కే ఈ శ్యాంబాబు ఉరుసుకువచ్చిన భక్తాదాలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాల్గొన్న రాష్ట్ర వాల్మీకి కార్పొరేషన్ చైర్మన్ బోజ్జమ్మ,మాజీ ఎంపీపీ రామచంద్ర నాయుడు లు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వివిధ ప్రాంతాల నుండి ఉరుసుకు వచ్చిన భక్తాదులను దృష్టిలో ఉంచుకొని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం హర్షనీయమని స్థానికులు పేర్కొన్నారు. కార్యక్రమంలో టిడిపి మండల కన్వీనర్ విజయభాస్కర్ గౌడ్, సింగల్ విండో చైర్మన్ రాజశేఖర్ గౌడ్, మాజి జెడ్పిటిసి ఉచ్చిరప్ప, టిడిపి నాయకులు రామారావు నాయుడు, రాజగోపాల్ గౌడ్, శాంతి కుమార్,రాముడు పాల్గొన్నారు.

You missed